ప్రతి పౌరుడి ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం..

Date:16/01/2021

నందికొట్కూరు ముచ్చట్లు:

దశలవారి గా అందరికీ కోవిడ్ వ్యాక్సిన్.. ఎమ్మెల్యే ఆర్థర్..
నందికొట్కూరులో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే…
టీకా వేసుకున్నా మాస్కు, సామాజిక దూరం పాటించాల్సిందే..
ఉత్తేజిత. నందికొట్కూరు. జనవరి 16.
ప్రతి పౌరుడి ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం అని , దశల వారిగా అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు.
నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తొగురు ఆర్థర్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  జేసి 2 ఖాజా మొహిద్దిన్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ వెంకటరమణ,నియోజక వర్గ ప్రత్యేక అధికారి వేణు గోపాల్ , కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్ డెంట్ డా. రాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ‘ఇవాళ చాలా ఆనందంగా ఉంది. కరోనా మహమ్మారితో చాలా ఇబ్బంది పడ్డాం. కనీవిని ఎరుగని విపత్తు చూశాం. కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించడం చూశాం.  మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీ మొదలు పెట్టి సఫలమయ్యాయి’

 

 

 

అన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నా మని, కోవిడ్ మహమ్మారిని తరిమేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంద న్నారు. ఒక్కొక్కరు రెండు డోసులు  వేసుకోవాలి. వ్యాక్సినేషన్ జరిగిన తరువాత లబ్ధిదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దశలవారీగా అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుంది’ అన్నారు. టీకా వేసుకున్నా  మాస్క్‌, సామాజిక దూరం పాటించాల్సిదేనని స్పష్టం చేశారు.

 

 

నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మొదటి కోవిడ్ టీకా ను చిన్న పిల్లల వైద్యులు డా. ప్రవీణ్ కుమార్ కు ఇచ్చారు.అనంతరం జేసి ఖాజా మొహిద్దిన్ మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా 14 నియోజక వర్గాల లో  మొదటి రోజు 27 కేంద్రాల్లో  టీకా వేసేందుకు చర్యలు చేపట్టామన్నా రు. జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 147 కేంద్రాలలో 35,470 మందికి  వ్యాక్సిన్‌ వేయనున్నామని తెలిపారు. మొత్తం నాలుగు విడతలలో  5 లక్ష ల 57వేల మంది కి టీకాలు వేయనున్నామన్నారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు) అందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 35వేల మంది ప్రభుత్వ, ప్రవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టా మన్నారు.

 

 

మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంద న్నారు. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారని తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాకు 40 వేల500  కోవిషీల్డ్,  కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయన్నారు. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌లో ఐదుగురు  సిబ్బంది చొప్పున 135 మంది సిబ్బంది విధులలో పనిచేస్తార న్నారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ ఇవ్వవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందన్నారు. ఎవరికి వ్యాక్సిన్‌ ఇవ్వకూడదో చెబుతూ  కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని పేర్కొంది.

 

 

 

గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరగనందున వారికి వ్యాక్సిన్‌ ఇవ్వవద్దని స్పష్టం చేసింద న్నారు. మొదటగా ఇచ్చిన డోసుకు సంబంధించిన వ్యాక్సిన్‌నే 14 రోజుల వ్యవధితో ఇచ్చే రెండో డోసులోనూ ఇవ్వాలని స్పష్టం చేసిందని తెలిపారు. నందికొట్కూరు సిహెచ్ సి పరిధిలో 532 మంది, పాముల పాడు పిహెచ్ సి పరిధిలో 458 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డి, ఎంపిడివో లు క్యాథరిన్, గౌరి దేవి ,ఐసిడిఎస్ సిడిపిఒ కోటేశ్వరమ్మ, పట్టణ సీఐ నాగరాజ రావు, డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, వైసీపీ నాయకులు ధర్మారెడ్డి, జాన్, తమ్మడపల్లి విక్టర్, షూ కుర్ మి య్యా, జగన్ రఫీ, మహిళ నాయకురాలు వనజ, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:The government’s goal is to ensure the health of every citizen.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *