The government's goal is to make a failed change in the medical field

వైద్యరంగంలో విఫ్లవమైన మార్పుతేవడమే ప్రభుత్వ ధ్యేయం

– 108,104 వాహనాల ఏర్పాట్లు మహనీయుడి చలువే
– ప్రజలందరి ఆరోగ్యభద్రత పట్ల సీఎం ప్రత్యేక దృష్టి
– కొత్త వాహనాలను ప్రారంభించిన నేతలు

Date:03/07/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

వైద్య రంగంలో విప్లవమైన మార్పు తెచ్చి, పేద ప్రజల ఆరోగ్యభద్రతను మెరుగుపర్చడమే ధ్యేయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి , జెడ్పిటీసీ దామోదరరాజు అన్నారు.శుక్రవారం ఎంపీపీ అభ్యర్థి గాజుల రామమూర్తితో, మాజీ జెడ్పిటిసీ సభ్యురాలు రుక్మిణమ్మ, సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు, వైద్యాధికారి పవన్‌తో కలిసి మండలానికి కేటాయించిన నూతన టెక్నాలజీతో రూపొందించిన 108,104 వాహనాలను ప్రారంభించారు.ఈ స్రంధర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో వెహోదటిసారిగా మహానేత దివంగతముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేసి పేదలకు సేవలందించారని కొనియాడారు. అదే భాటలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నవర త్నాల్లో బాగంగా ప్రకటించిన హామీలతో పాటు అనేక పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సేవలందించిన ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. ఆపద సమయంలో ప్రజలకు సకాలంలో వైద్య •సేవలందించి, ఆదుకోవడంతోపాటు వెయ్యిరూపాయలకు పైగా ఖర్చు పెరిగితే ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించేదిశగా ప్రభుత్వం అమలు చేయడం మనందరి అదృష్టమని కొనియాడారు. రాత్రింబవళ్లు పేదలకోసం సేవలందించిన 108 సిబ్బంది ప్రసాద్‌, గణేష్‌,హరి తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రూపారేఖ,శ్రీరాములు నేతలు హరిబాబు,లడ్డూరమణ, రాధాక్రిష్ణయ్య,రఘుస్వామి నాగరాజ, కళ్యాణ్‌, వరుణ్‌,మహమ్మదాలి,అల్తాఫ్‌, చిన్నా, గంగిరెడ్డి,రమేష్‌,తదితరులున్నారు.

ఖాళీ అవుతున్న హైదరాబాద్!

Tags:The government’s goal is to make a failed change in the medical field

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *