నవరత్నాలను అందించడమే ప్రభుత్వ ఆశయం

The government's intent is to provide Navratna

The government's intent is to provide Navratna

– కమిషనర్‌ వర్మ

Date:17/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని అర్హులైన పేదలందరికి నవరత్నాల పథకాలను అందించడమే ప్రభుత్వ ఆశయమని ఇందుకోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం నానబాలవీధి సచివాలయంలో గృహ నిర్మాణ లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, మాజీ కౌన్సిలర్లు ఇనాయతుల్లా షరీఫ్‌, త్యాగరాజు అతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ ఆ సచివాలయ పర్యిధిలో గృహనిర్మాణాల లబ్దిదారుల జాబితాను మహిళలకు చదివి వినిపించారు. దీనిపై అభ్యంతరాలను, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అర్హులందరికి గృహ నిర్మాణాలు చేపట్టి ఇస్తామన్నారు. అలాగే నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం నిర్ధేశించిన సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందజేస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరు సహనంతో , చిరునవ్వుతో ప్రజలతో మెలగాలని , ఈ మేరకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సంక్షేమ పథకాల అమలును పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్‌ సిబ్బంది, వలంటీర్ల సర్వేలో లబ్ధిదారులు ఎవరైన లేకపోయిన తక్షణమే తమకు తెలియజేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైన ప్రజలు నేరుగా కార్యాలయంలో తనను సంప్రదించి, సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌వో రామకృష్ణ, మున్సిపల్‌ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

19న మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్ష

Tags: The government’s intent is to provide Navratna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *