Natyam ad

పేద ప్రజల భవిష్యత్తుకు  బాటలు వేయడమే ప్రభుత్వం ధ్యేయం

కడప ముచ్చట్లు:

పేద బడుగుబాలహీన వర్గాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  విద్యా, వైద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ను ఇస్తూ  ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, నగర మేయర్ కె. సురేష్ బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ బండి గంగా దేవి, డివిజన్ ఇంఛార్జి కిరణ్,  వారి  ఆధ్వర్యంలో  1వ సచివాలయం పరిధిలోని        ఎన్ జీవో కాలనీ, కోఆపరేటివ్ కాలనీ, సభాపతి వీధి లలో 39 వ రోజు న  “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా  ప్రారంభించారు.ఈ సందర్భంగారాష్ట్రఉపముఖ్యమంత్రి.. స్థానిక కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి.. ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి.. ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అంద‌జేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా.. పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు రెఫర్ చేశారు.

 

 

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయ ని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. కార్యక్రమంలో… ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం  అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకు సాగారుఈ కార్యక్ర మంలో ఉపముఖ్య మంత్రి, నగర మేయర్ తో పాటు  9వ డివిజన్ కార్పొరేటర్ బండి గంగా దేవి, డివిజన్ కిరణ్,  వైకాపా నాయకులు అఫ్జక్ ఖాన్, కాల్ టాక్స్ హఫీసుల్ల,డాక్టర్ సోహైల్,  వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, డైరెక్టర్లు,   ఇతర నగర కార్పొరేటర్లు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి,  సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: The government’s mission is to pave the way for the future of poor people

Post Midle

Leave A Reply

Your email address will not be published.