అర్హులందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం

-గతంలో ఇళ్లు, ఇళ్ళ స్థలాలు పొందినవారికి త్వరలో రద్దు చేసుకొనే అవకాశం!

-లే ఔట్ డెవలప్మెంట్ చేసే బాధ్యత ప్రభుత్వానిదే

-విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సజ్జల రామకృష్ణారెడ్డి హామీ

విశాఖపట్నం ముచ్చట్లు:

 

అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాల జీవో ద్వారా న్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు శుక్రవారం అమరావతిలో సజ్జలను కలిసి జర్నలిస్ట్ హౌసింగ్ జీవోలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ జీవో పై జర్నలిస్టులు అభిప్రాయాలను ఆయనకు వివరించారు. సొసైటీ ప్రతినిధులు తీసుకువచ్చిన పలు అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు.ఇటీవల కాలంలో జగనన్న ఇళ్ల పథకం ద్వారా సెంటు స్థలం పొందినవారు, గతంలో టిడ్కో ఇళ్లు గాని మరే ఇతర ప్రభుత్వ పథకంలో ఇంటి స్థలం లబ్ది పొందిన జర్నలిస్టులు వాటిని తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తద్వారా జర్నలిస్ట్ హౌసింగ్ పథకానికి అర్హులుగా పరిగణించేలా చూస్తామని చెప్పారు.

 

 

 

గతంలో ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులకు కేటాయించే ఇళ్ల స్థలాల జీవోకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా రూపొందించామని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పారదర్శకంగా అందించేందుకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఎదురైన ఇబ్బందులు అన్నిటినీ పరిగణనలోనికి తీసుకొని జర్నలిస్టులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వమే లే ఔట్ వేసి డెవలప్మెంట్ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అందుకయ్యే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. గతంలో ఈ డవలప్మెంట్ ఖర్చు సొసైటీలు భరించేవని ఇప్పుడు అందులోనూ ప్రభుత్వ భాగస్వామ్యం వున్న విషయాన్ని గమనించాలని కోరారు.
జిల్లాల వారీగా ప్రభుత్వ స్థలాలు గుర్తించి వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి నేతృత్వంలో స్క్రూటినీ కమిటీ నియమిస్తామని, అందులో జర్నలిస్టులకి భాగస్వామ్యం కల్పిస్తామని ఆ కమిటీ నిర్ణయం మేరకే స్థలాల ఎంపిక వుంటుందని చెప్పారు.

 

 

 

ఈ ఏడాది అక్రిడేషన్ లేని వారికి సీనియారిటీ ప్రాతిపదికన స్థలాలు కేటాయించే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. జర్నలిస్టులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వారిలో విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కేజీ రాఘవేందర్ రెడ్డి, జి. జనార్దన్ రావు, అధ్యక్షులు బి .రవికాంత్, ఉపాధ్యక్షుడు కొయిలాడ పరుశురాం, సహాయ కార్యదర్శిలు బందరు శివప్రసాద్, ముప్పిడి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The government’s mission is to provide housing to all deserving people

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *