Date:03/10/2020
తెలంగాణ ఉద్యమంలో వికలాంగుల పాత్ర మరువలేనిది
వికలాంగుల సమస్యలపై
“మండలి”లో చర్చిస్తా
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల ముచ్చట్లు:
వికలాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందని కరీంనగర్ పట్టబధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం
ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్బంగా జగిత్యాల అంబేద్కర్ చౌరస్తాలో వికలాంగులతో కలిసి జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి వారికి తినిపించారు.
ఈసందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులుగా పుట్టడం మానవతప్పిదం లేదని, దేవుడు చిన్నచూపుచూడడంతో వారు ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రచించారని, అలాగే ప్రత్యేక నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాల్సి ఉండగా వీరిని పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వికలాంగులపాత్ర మరువలేనిదని పేర్కొంటూ, ప్రత్యేక రాష్ట్రంలో వారికి ఉద్యోగ, స్వయంఉపాధి అవకాశాలు కల్పించక నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.
దివ్యంగుల సంక్షేమశాఖనే తీసివేసి దీన్ని ఇతర శాఖలో విలీనం చేయడం అన్యమని, వికలాంగులు రెండేళ్లుగా ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగులకు రెండేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వడంలేదని, అలాగే నిధులు కేటాయించకుండా, నిరుద్యోగభృతి కల్పించక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పూర్తిస్థాయి వికలాంగుడు పింఛన్లకోసం ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరిగిన పాటయించుకోకపోవడంతో నేనే స్వయంగా ప్రజావాణికి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పింఛన్ ఇప్పించానని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జీవనరెడ్డి గుర్తు చేశారు. 6 సంవత్సరాలుగా వికలాంగుల సంక్షేమానికి కేటాయించిన నిధులు,కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం స్వేతపత్రం విడుదలచేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువశాతం మంది వికలాంగులు ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. వికలాంగులకిచ్చే ట్రైసైకిల్ కు 40వేల రాయితీ వికలాంగుల ఖాతాలో వేయడంతోపాటు మరో 60వేలు బ్యాంకు ఋణం ఇప్పిస్తే ఒక దుకాణం పెట్టుకొని స్వయం ఉపాధి పొందుతాడని, ప్రభుత్వం ఇదిశలో ఆలోచించాలని సూచించారు.
వికలాంగులకు రాజ్యాంగపరంగా 4శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వికలాంగుల సంక్షేమంపై శాసనమండలిలో ప్రత్యేకంగా చర్చిస్తానని జీవన్ రెడ్డి వికలాంగులకు అభయమిచ్చారు. వికలాంగుల సంక్షేమానికి తాను అధిక ప్రాధాన్యతనిస్తానని, అలాగే వీరు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. లంకదాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కారణం చూపుతూ వికలాంగుల దినోత్సవం అధికారికంగా జరపకపోవడం దారుణమని, ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్ని జరిగిన దీనికి కోవిడ్ కారణం చూపడం అన్యాయమని ఆరోపించారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లంకదాసరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య, బీర్పూర్
ఎంపిపి మసర్థి రమేష్, గాజుల రాజేందర్, అల్లాల రమేష్ రావు,చందా రాధాకిషన్, కోర్టు శ్రీనివాస్, గుండా మధు, వెంకటేష్, వికలాంగులు పాల్గొన్నారు. అనంతరం వికలాంగులు జగిత్యాల పట్టణంలో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు.
బీజేపీ పార్టీ ని బలోపేతం చేయాలి
Tags:The government’s reckless attitude towards the welfare of the disabled should be abandoned