రేపు సురుటుపల్లి ఆలయాన్ని సందర్శించనున్న తమిళనాడు గవర్నర్ .

సత్యవేడు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని తమిళనాడు గవర్నర్ బన్విరిలాల్ పురోహిత్ జూలై 11వ తేదీన సందర్శించనున్నటు ఆలయ కార్యనిర్వహణాధికారి రవీంద్రరాజు పేర్కొన్నారు .ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తమిళనాడు గవర్నర్
బన్విరిలాల్ పురోహిత్ సురుటుపల్లి ఆలయానికి చేరుకుని శ్రీమరదాంబికావాల్మీకి ఈశ్వరస్వామి వారిని ,పల్లికొండేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు .అంతకుమునుపు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మస్థానమైన తమిళనాడు ఊతుకోట సమీపంలోనే తండలం గ్రామంలో శంకర రూరల్ మెడికల్ సెంటర్ను ,సత్సంగ భవనానికి తమిళనాడు గవర్నర్ బన్విరిలాల్ పురోహిత్ ప్రారంభోత్సవం చేయడంతోపాటు వేదపాఠశాలను సందర్శించనున్నటు అధికారులు పేర్కొన్నారు .ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలను పోలీసులు చేపట్టడం జరిగింది .

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: The Governor of Tamil Nadu will visit the Surutupally Temple tomorrow.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *