వైభవంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు

Date:09/11/2019

తిరుమల ముచ్చట్లు:

కైశిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఆలయ మాడ వీధుల్లో వైభోవేతంగా జరిగింది.తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నారు.ఈ మూర్తులు వరుసగా – భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములుగా వర్ణిస్తారు.వీటినే అర్చక పరి భాషలో ధ్రువబేరం , కౌతుక బేరం , స్నపన బేరం , ఉత్సవ బేరం , బలి బేరంగా పిలుస్తారు.ఇలా ప్రధానాలయంలోని గర్భగుడిలో ఉన్న ఒక్కొక మూర్తికి ఒక్కో చరిత్ర కలిగి ఉంటుంది.శ్రీదేవి భూదేవి సమేత ఉగ్రశ్రీనివాస మూర్తిని ఊరేగించే సమయంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకి తిరుమలలో భయంకర పరిణామాలు ఏర్పడి ఈ ఉత్సవం నిలిచి పోయింద అటా…అందుచేత సంవత్సరంలో క్షిరాబ్ది ద్వాదశి రోజు వేకువ జామున 4.30 గంటల సమయంలో ఆలయం వీడి తిరిగి 5.30 గంటలలోపు అలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు.వాహనం ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆలయ అర్చకులు కైశిక ద్వాదశి ఆస్థాన పురాణాన్నీ వేడుకగా నిర్వహించారు.ఈ కారణంచేత అలయంలోని పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.

జిల్లా అంతటా 144 సెక్షన్, హై అలర్ట్ ప్రకటన

Tags: The grand procession of the fierce Srinivasamoorthy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *