ఈ నెల 27న విశాల్‌ ‘అయోగ్య’ తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌

The grand release of Vishal's 'Ayogya' in Telugu this month

The grand release of Vishal's 'Ayogya' in Telugu this month

Date:08/07/2019

 

హైదరాబాద్‌ముచ్చట్లు:

విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్‌ సరసన రాశీఖన్నా కథానాయికగా నటించింది. ‘ఠాగూర్‌’ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని  సార్థక్‌ మూవీస్‌ అధినేత ప్రశాంత్‌ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 27న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్‌ చేయనున్నారు.ఈ సందర్భంగా నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘అయోగ్య’ తమిళంలో ఘనవిజయం సాధించింది. అక్కడా బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లను రాబట్టింది. తమిళ క్రిటిక్స్‌ సైతం ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్రశంసలు కురిపించారు. విశాల్‌ ఎనర్జీ లెవల్‌ని పదింతలు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌. తమిళనాడులో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా పతాక సన్నివేశాల్ని దర్శకుడు తీర్చిదిద్దారు. తమిళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో  మా సార్థక్‌ మూవీస్‌ ద్వారా రిలీజ్‌ చేస్తుండడం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్‌ నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి. ఆ కోవలోనే ‘అయోగ్య’ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈనెల 27న ఏపీ, నైజాంలో రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.

 

ఇడుపలపాయలో వైఎస్ జగన్

 

Tags: The grand release of Vishal’s ‘Ayogya’ in Telugu this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *