శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Date:21/10/2019

 

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.  ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.

 

 

 

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  శాంతి, ఏఈవో తిరుమలయ్య,  సూప‌రింటెండెంట్  ర‌మేష్‌,  పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

అక్టోబర్ 27న దీపావళి ఆస్థానం…….

శ్రీ కోదండరామాలయంలో అక్టోబర్ 27వ తేదీ అమావాస్య, దీపావళి సందర్భంగా రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

 

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tags: The grandeur of Sri Sitaramalau Kalyana in Srikodandaramalayam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *