The Great Parvata Fair at the Sri Govindarajaswamy Temple

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Date:17/01/2020

 

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.  ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు.  తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6.00 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో   వరలక్ష్మి, ఏఇఓ   రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు  రాజ్‌కుమార్‌,  శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు   కృష్ణమూర్తి,   మునీంద్రబాబు, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

స్వచ్చ సర్వేక్షణ్‌ లో భాగస్వామ్యులుకండి

Tags: The Great Parvata Fair at the Sri Govindarajaswamy Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *