భారతీయ సంస్కృతిని చాటిన గొప్పయోగి స్వామివివేకానంద

The great Yogi Swami Vivekananda, who achieved Indian culture

The great Yogi Swami Vivekananda, who achieved Indian culture

Date:11/01/2019
ఒంగోలు ముచ్చట్లు:
భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలలో చాటిచెప్పిన గొప్ప వేదాంత యోగి స్వామివివేకానంద అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శనివారం ఉదయం 156 వ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్థానిక క్రొత్తపట్నం బస్టాండ్ దగ్గర స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వివేకానందను స్పూర్తి గా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాలు స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలన్నారు. హిందు ఐక్యత కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వామి వివేకానంద వారి జీవిత చరిత్రను ప్రచారమాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆయన సూచించారు. హిందు మత ప్రాముఖ్యత గురించి విదేశాలలో ఎన్నో ఉపన్యాసాలు చేశారన్నారు. స్వామి వివేకనంద వారి ప్రసంగాలకు అమెరికా, యితర దేశాలలో వారికి బ్రహ్మరధంపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఇన్ ఛార్జి కలెక్టర్  ఎస్. నాగలక్ష్మి, స్టెప్ సిఈవఓ బి.రవి, వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్ధ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, స్వామి వివేకనంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Tags:The great Yogi Swami Vivekananda, who achieved Indian culture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *