Natyam ad

దేశంలోనే గొప్ప పథకం దళిత బంధు

-అర్హులైన దళితులందరికి దళిత బంధు పథకం అమలు చేస్తాం
– కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశ దళిత బంధు అమలు
– రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ ముచ్చట్లు:
 
దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో దళిత బంధు అమలుపై జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాల కిషన్, సుంకె రవిశంకర్ లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఏ ప్రధాన మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ చేపట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కన్న కలల్ని నిజం చేసెందుకు దళితుల అభివృద్దిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కే.సి.ఆర్. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో అర్హులైన 17,556 కుటుంబాల ఖాతాల్లో దళిత బంధు నగదు జమ చేశామని తెలిపారు.
 
 
 
1500 లకు పైగా కుటుంబాలు డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకోగా వారికి శిక్షణ ఇప్పించి యూనిట్లను మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. డెయిరీ షెడ్ల నిర్మాణం కోసం రూ.లు 1.50 లక్షలు అందించామని అన్నారు.  6,800 మంది ట్రాన్స్ పోర్ట్ వాహనాల కోసం ధరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన వారికి లైసెన్సులు ఇప్పించామని తెలిపారు. దళిత బంధు పథకంలో లాభసాటిగా ఉండే డెయిరీ యూనిట్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, మిగతా యూనిట్లకు లబ్దిదారులకు అవగాహన కల్పించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నామని అన్నారు. జిల్లాలోని కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశలో మార్చి 31 వ తేదీలోగా వంద యూనిట్ల చొప్పున దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 15 వ తేదీ లోగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారుల సహాయంతో లబ్దిదారులను ఎంపిక చేసి మార్చి 1 వ తేదీ లోగా జాబితా తయారు చేయాలని సూచించారు. దశల వారీగా దళిత కుటుంబాలందరికి దళిత బంధు అమలు చేస్తామని, ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దని మంత్రి సూచించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాల కిషన్, సుంకె రవి శంకర్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, తదితరులు దళిత బంధు పథకం అమలు తీరుపై సూచనలు అందజేశారు.
 
జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ అర్హులైన దళితులందరికి దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు. హుజురాబాద్ నియోయకవర్గంలో యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలు లాభసాటి స్వయం ఉపాధి యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశలో నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున మంజూరు చేస్తామని అన్నారు. దశల వారీగా అర్హులందరికి దళిత బంధు పథకం అమలు అవుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీ.వి. రామకృష్ణా రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డి. సురేష్,  కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: The greatest scheme in the country is the Dalit Bandhu

Leave A Reply

Your email address will not be published.