ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: శరద్ యాదవ్

The guarantees given to AP must be fulfilled: Sharad Yadav

The guarantees given to AP must be fulfilled: Sharad Yadav

Date:11/02/2019
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎల్జేడీ నేత శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు శరద్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలానే అన్ని పక్షాలు ఏకమయ్యాయని గుర్తుచేశారు.దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని శరద్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Tags:The guarantees given to AP must be fulfilled: Sharad Yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *