బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి   సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

Date:11/06/2019

నాగర్ కర్నూలు  ముచ్చట్లు:

14 నుంచి 19వ వరకు ప్రొఫెసర్ జయశంకర్సార్ బడిబాట -14  సంవత్సరాలలోపు బాల, బాలికల జాబితా సిద్ధం చేయాలి.   బడికి దూరంగా ఉన్న బాల, బాలికలను బడిలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్  శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో తన చాంబర్లో జిల్లా స్థాయి అధికారులతో బడిబాటపై సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. బడి పిల్లలందరి జాబితా తయా చేయాలన్నారు. బడిబయట పిల్లలు వలస కుటుంబాల సర్వే ప్రణాళికలు రూపొందించాలని, స్వల్ప కాలంగా బడి మానేసిన పిల్లలు, దీర్ఘకాలంగా బడి మానిన పిల్లలు, అసలు బడిలో చేరని పిల్లల జాబితాను కూడా రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ నెల 14 నుంచి 19వ తేదీవరకు నిర్వహించే బడిబాట కార్యక్రమంలో ప్రచా సామాగ్రిని పాఠశాలల స్థాయిలో తయారు చేసుకొని, విద్యా రిజిస్టర్ గ్రామంలో 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికల వివరాలు, బడి బయట ఉన్న పిల్ల ల వివరాలు జాబితా తయారు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లా లోని అంగన్వాడీలలో చదువుతున్న 5 సంవత్సరాల వయసు గల 5104 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే నమోదయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

 

 

 

 

2019-20 ఏడాదికి సంబంధించి వార్షిక ప్రణాళికలను, పాఠ్యప్రణాళికలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తయారు చేసుకునేలా చూడాలని డిఇవోను కోరారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలకు నీరుపోసి సంరక్షించాలని బడి బాట కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యతా జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ, ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని, అలాగే బడిబాట కార్యక్రమంలో  అందరూ మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, వీఆర్ఏలు తప్పనిసరిగా  పాలు పంచుకోవాలని జాయింట్ కలెక్టర్  కోరారు.
మొదటి రోజు కార్యక్రమం మనబడి బాట సర్వే చేయాలని తెలిపారు. రెండో రోజు పిల్లల ఆరోగ్య పరీక్షలు, మూడో రోజు బాలికల రోజు, నాల్గో రోజు స్వచ్ఛ పాఠశాల, హరితహారం, ఐదవ రోజు బాల కార్మికుల విముక్తి అంశాలుగా రూపొందించడం జరిగిందని సంయుక్త కలెక్టర్ వివరించారు.  విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు తప్పనిసరిగా బడి బాట కార్యక్రమంలో అందించాలని అధికారులకు ఆదేశించారు.

 

 

 

 

మధ్యాహ్న భోజన విషయంలో కఠినంగా వ్యవహరించాలని, మెనూ ప్రకారం పిల్లలకు వడ్డించాలని, లేని యెడల వారి స్థానంలో మరొకరిని నియమిస్తామన్నారు.
వంటశాలను పాఠశాలలో వాడుకోవడానికి వెంటనే పూర్తి చేయాలని  సంబంధిత ఇంజినీర్ల అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి పాఠశాలకు తాగునీరు అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఈవో గోవిందరాజులు, పిడి డి ఆర్ డి ఏ సుధాకర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, మహిళ  శిశు సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి ప్రజ్వల, నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, సెక్టోరల్  అధికారి అహ్మద్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

 

అసెంబ్లీకి పసుపు చోక్కాలతో టీడీపీ ఎమ్మెల్యేలు

 

Tags:The handshake program should be performed properly
US Collector Srinivas Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *