Natyam ad

సంక్షేమ సారధికి పట్టం కట్టాలి

పుంగనూరుముచ్చట్లు:

రాబోవు ఎన్నికల్లో సంక్షేమ సారధి, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి రెండవ సారి పట్టం కట్టాలని , ఆయన పాలనలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని పలువురు ప్రచారం చేశారు. శుక్రవారం పట్టణంలోని బస్టాండులో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ సాజిదాబేగం ప్రచారాలు నిర్వహించారు. అలాగే ముస్లిం యూత్‌ నాయకులు, కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌, అస్లాంమురాధి, మమ్ము, అఫ్రిద్‌, మాలిక్‌, నయాజ్‌, ఆసిఫ్‌, మన్సూర్‌ తదితరులు కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలో పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ, శరణ్‌, వరదారెడ్డి, పిఎల్‌.శ్రీధర్‌, రామకృష్ణ లు ప్రచారం చేశారు. అలాగే చదళ్ల గ్రామంలో 77 సంవత్సరాలు వయసు కలిగిన సర్పంచ్‌ గౌరమ్మ మహిళలను వెంటపెట్టుకుని, ర్యాలీ చేసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని , రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు. సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళులా బావించి పని చేస్తున్న జగనన్న లేకపోతే సంక్షేమం ఆగిపోతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఇర్ఫాన్‌, మన్సూర్‌, అఫ్సర్‌, ఇంతియాజ్‌, షరీఫ్‌, తక్‌షీర్‌, ఇమ్రాన్‌, బషీర్‌, షావాలి, ఆయిషా, జబీనా, మౌనిక, జుబేర్‌, దాదాపీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; The head of welfare should be crowned

 

Post Midle