శిరీషను యువత ఆదర్శంగా తీసుకోవాలి- నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్

నెల్లూరు ముచ్చట్లు:

 

 

శిరీషను యువత ఆదర్శంగా తీసుకోవాలని నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్  మహేందర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన బండి శిరీష, అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళుతున్న సందర్భంగా  శనివారం గాంధీనగర్లోని సేవాసదన్లో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ దూసుకెళ్తున్నారు అని అన్నారు. యువత తమ లక్ష్య సాధనకు శిరీషను ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ మాట్లాడుతూ  గతంలో భారతదేశం నుండి కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారని, ఆంధ్రరాష్ట్రానికి చెందిన శిరీష వెళ్లడం అందరికీ గర్వకారణమన్నారు .అన్ని రంగాల్లో విజయ కేతనం ఎగరేస్తున్న మహిళలు ముందుముందు  దేశాభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు .రాజకీయ, విద్యా ,వైద్య రంగాలతొ పాటు శాస్త్రవేత్తలగా స్త్రీలు రాణించడం శుభసూచకమన్నారు  .న్యూనతా భావానికి లోను కాకుండా మహిళలు ప్రతి రంగంలో ముందుకు దూసుకుపోవాలని ఆయన కోరారు  .ఈ సందర్బంగా కేక్ కట్ చేసి శిరీషకు అభినందనలు తెలియజేశారు.అతిథులకు అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రమాదేవి జ్ఞాపికలు అందజేశారు  .ఈ కార్యక్రమాల్లో పీ.ఎం.పీ. అసోసియేషన్ అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్,  రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్.  రసూల్  సేవా సంస్థ నిర్వాహకురాలు. మాధవి,  స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్ష కార్యదర్శులు. సర్వేపల్లి రామ్మూర్తి, హనోక్, రచయితల సంఘం కోశాధికారి. రాఘవేంద్ర శేఖర్, వసుజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్.జె వసుంధర, మహిళా పోలీస్. షాహీన, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, నారాయణ, మన్సూర్, సోను, గీత,  తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: The head should be taken as an ideal by the youth- Nehru Youth Center Coordinator

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *