Natyam ad

విషమంగా సూపర్ స్టార్ ఆరోగ్యం

హైదరాబాద్ ముచ్చట్లు:

సూపర్ స్టార్ కృష్ణ  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిన్న కృష్ణ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. గత కొద్దిరోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఆయన శ్వాససంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణ ను ఐసీయూలో ఉంచి చికిత్య అందిస్తున్నారు వైద్యులు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆలాగే ఆయన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక కృష్ణ మిత్రుడు కృష్ణం రాజు కూడా ఇటీవలే కన్నుమూశారు. ప్రస్తుతం కృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కాంటినెంటల్ హాస్పటల్ కు మహేష్ బాబు సహా ఇతర కుటుంబసభ్యులు చేరుకున్నారు
24 గంటలు గడవాల్సిందే.

 

 

Post Midle

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రి చైర్మన్‌ గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సుమారు ఆయన మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఎమర్జేన్సీకి తరలించాం. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందించాం. అరగంట పాటు సీపీఆర్‌ చేశాం. ప్రస్తుతం ఇంటెన్సీవ్‌ కేర్‌లో ఉన్నవారికి ఎటువంటి చికిత్స ఇవ్వాలో అదే చేస్తున్నాం.ఇప్పటికీ చికిత్స కొనసాగుతూనే ఉంది. మరో 24 గంటల వరకు ఏం చెప్పలేం’ అన్నారు. అనంతరం ఆయన దగ్గరి బంధువులంతా ఆస్పత్రిలో ఉన్నారని, వారి ప్రైవసీని ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన కోరారు. అంతేకాదు ప్రతి గంట క్రూషియల్‌ అని, ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దాం చైర్మన్‌ గురునాథ్ రెడ్డి అన్నారు. దీంతో తమ అభిమాన నటులు కృష్ణ కోలుకోవాలని ఘట్టమనేని ఫ్యాన్స్‌, సినీవర్గాలు ప్రార్థిస్తున్నాయి. కృష్ణ కొన్ని రోజులుగా కృష్ణ బయటకు రావడం లేదు. వయసు రీత్యా ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి.

 

 

అందువల్ల, ఎక్కువగా ఇంటికి పరిమితం అవుతున్నారు. గతంలో మహేష్ బాబు సినిమా ఫంక్షన్స్‌కు అటెండ్ అయ్యేవారు. ఈ మధ్య అది కూడా లేదు. ఫంక్షన్స్ గట్రా అవాయిడ్ చేస్తున్నారు. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృష్ణకు ఆస్థమా ఉందని, వాతావరణంలో మార్పులు రావడంతో కొద్దిగా నలత చేసిందని, అందువల్ల ఆస్పత్రికి తీసుకు వెళ్లారని మొదట్లో తెలిపారు. కానీ, ఆయన కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణ సన్నిహిత వర్గాలు చెప్పారు. తొలుత రెగ్యులర్ చెకప్ కోసమే కృష్ణ ఆసుపత్రికి వెళ్లారని ఘట్టమనేని ఫ్యామిలీ వర్గాలు వెల్లడించాయి. అయితే, కృష్ణ‌కు చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ.. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వెంటీలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. 24 గంటల తర్వాత మరో హెల్త్ బులిటిన్ ఇస్తామని అన్నారు. కృష్ణ కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరారని వెంటనే ఆయనకు చికిత్స అందించామని, ఇంకా పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఇప్పట్లో చెప్పలేమన్నారు.

 

భార్య, కుమారుడి మరణం తర్వాత…
కుటుంబం అంటే కృష్ణకు ఎక్కువ ప్రేమ. ముఖ్యంగా పిల్లలు అంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్ను మూశారు. ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. భార్య, కుమారుడి మరణం ఆయనను బాధకు గురి చేసిందని సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. కృష్ణ, ఇండియా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని యువ హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సోదరుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. ఇక, మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ స్టార్‌గా, తండ్రి తగ్గ తనయుడిగా స్టార్ డమ్ కొనసాగిస్తున్నారు.  మే 31న కృష్ణ బర్త్ డే. ఆ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అందరితో కలిసి భోజనం చేశారు. కృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఆయన్ను కుమార్తె మంజుల ఇంటర్వ్యూ చేశారు.

 

Tags: The health of the superstar is critical

Post Midle

Leave A Reply

Your email address will not be published.