భారీగా  తగ్గిన మిరప రేటు

The heavily reduced chilli rate

The heavily reduced chilli rate

Date:17/04/2018
విజయవాడ ముచ్చట్లు:
మిరప ధరలు భారీగా తగ్గాయి. 15 రోజుల వ్యవధిలో క్వింటాల్‌ ధరలో రూ.2 వేలు వ్యత్యాసం వచ్చింది. ప్రస్తుతం ఉన్న ధరకు అమ్ముకోవాలా.. గిట్టుబాటు  కోసం శీతల గిడ్డంగిలో నిల్వ చేసుకోవాలా.. అని రైతులు ఆలోచిస్తున్నారు. ఏప్రిల్‌ ప్రారంభం నుంచి ధరలు పడిపోవడం ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నుంచి ఎగుమతులు తగ్గిపోవడంతో నిల్వలు పెరిగి ధర క్షీణిస్తోందని వ్యాపారులు తెలిపారు. కల్లాల్లోనే కాయలు రాశులుగా పోసి ధర కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో మిరప రైతు ఎప్పుడూ లేని విధంగా నష్టాలను మూటగట్టుకున్నాడు. 2015లో కాసులు పండినా.. ఆ తర్వాత ఏడాది ఈ పంట కన్నీరు మిగిల్చింది. అప్పట్లో రూ.10వేలకు పైగా ధర పలికిన మిరప ధర ఇప్పుడు నేలను తాకింది. విత్తనాల కొరత ఏర్పడినా ఎంతో ఆశతో అధిక ధరలతో కొనుగోలు చేసి పంట సాగు చేస్తే పెట్టుబడి కూడా దక్కకని పరిస్థితి నెలకొంది. సాధారణ సాగు 15,567 హెక్టార్లు కాగా.. 24,494 హెక్టార్లలో పంట సాగయింది. కిలో విత్తనం ధర రూ.20వేల వరకు పలికిందంటే ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఎరువులు, పురుగు మందులు, కూలీలు, ఇతరత్రా ఖర్చులు ఎకరాకు రూ.లక్షలకు పైగా పెట్టుబడిగా పెట్టారు. అయితే పెట్టుబడిలో 20 శాతం కూడా దక్కకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.జిల్లాలో ఈ ఏడాది 27 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. సాగునీరు సకాలంలో అందడం, చీడపీడల బెడద పెద్దగా లేకపోవడంతో ఆశించిన దిగుబడులు వస్తున్నాయి. నెలాఖరు నాటికి కాయ కోతలు కూడా పూర్తవుతాయి. పెట్టుబడి కూడా  భారంగా ఉంది. నిలకడలేని ధరలతో ఆశించిన నికరాదాయం లభించడం లేదు. ఈ ఏడాది సాగు చేసిన మిరపలో ఫిబ్రవరి మూడో వారం నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో క్వింటాల్‌ రూ.8,500 ఉంది. క్రమేణా రూ.9,500, రూ.10,000 కూడా పలికింది. మార్చి చివరి వారంలో నాణ్యమైన కాయలు క్వింటాల్‌కు రూ.10,300 వరకు ధర లభించింది. ఏప్రిల్‌ నుంచి ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం నాణ్యత మేరకు క్వింటాల్‌ రూ.7,000 నుంచి రూ.8,000  వరకు లభిస్తోంది. ధరలు పడిపోవడంతో పలు గ్రామాల్లో రైతులు కాయలను సమీప శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు.
Tags: The heavily reduced chilli rate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *