పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి-మంత్రి పువ్వాడ

హైదరాబాద్ ముచ్చట్లు:


మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,ఎమ్మెల్యే ఎం. నాగేశ్వర్ రావు,ఎమ్మెల్సీ తాత మధులు మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ .భద్రాచలం కు ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు ,ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన చర్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెయ్యి కోట్ల రూపాయల తో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు ఉమ్మడి  ఖమ్మం జిల్లా తరపున కృతజ్ఞతలు . పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడం లో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కరకట్టలు గతం లో కట్టినా అవి పటిష్టంగా లేవు.. సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం కోసం నిపుణుల కమిటీ ప్రకటించారు. ముంపు నకు గురయ్యే కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం దిశగా సీఎం చర్యలు ప్రకటించారని అన్నారు.

 

 

 


వరదలోనూ సీఎం కేసీఆర్ పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. వరదలతో గ్రామాల్లో దెబ్బ తిన్న విద్యుత్ వ్యవస్థను  దాదాపుగా పునరుద్ధరించుకోగలిగాం. పారిశుధ్య పరిస్థితి ని మెరుగు పరిచేందుకు వివిధ జిల్లాల నుంచి దాదాపు నాలుగు వేల మంది సిబ్బందిని రప్పించాం. తాగు నీటి సరఫరా ను పునరుద్ధరించాం. ఇంత స్థాయి వరదల్లోనూ ఒక్క ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్నాం. వరదల పరిస్థితిని సీఎం గారు ముందే ఊహించి ఈ నెల 13 నుంచే మమ్మల్ని అక్కడ ఉండాలని ఆదేశించారు. ప్రతీ గంట కు సీఎం కేసీఆర్ మాకు నిరంతరంగా ఆదేశాలిచ్చారు. .తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 25 వేల మంది ని పునరావాస శిబిరాలకు తరలించడం ఇదే మొదటి సారి. ఇన్ని ఏర్పాట్లు చేసినా మీడియా లో సౌకర్యాల లేమి అంటూ వార్తలు రావడం దురదృష్టకరం. ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా అంటు వ్యాధులు ప్రబలకుండా మంత్రి హరీష్ రావు నిరంతరం వైద్య శాఖ సిబ్బంది కి ఆదేశాలిస్తున్నారు. పోలవరం కోసం మన ఏడు మండలాలు ఆంధ్రా లో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఆది లోనే మేము నిరసన తెలిపామని అన్నారు

 

 

 

.
కనీసం ఐదు గ్రామలనైనా తిరిగి తెలంగాణ లో కలపాలని మేము కోరుతున్నాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతున్నాం. గిరిజనులను, గిరిజనేతరులను వరదల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. .ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన వరద సాయం బాధితుల అకౌంట్ల లో జమ అవుతుంది. .బియ్యం, పప్పు ఇప్పటికే భాదితులకు అంద జేశాము. .పోలవరం జాతీయ ప్రాజెక్టు.. వరదల నివారణకు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. .పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారు. ఎత్తు తగ్గించాల్సిన భాద్యత కేంద్రం మీద ఉంది. బీజేపీ నేతలు కేంద్రం నుంచి సాయం తేకుండా వట్టి మాటలు మాట్లాడుతున్నారు. గుజరాత్ కు వరద సాయం చేసిన కేంద్రం తెలంగాణ కు ఇప్పటి వరకు సాయం ప్రకటించలేదు. .హైద్రాబాద్ వరదలు వచ్చినపుడు బీజేపీ పట్టించుకోలేదు.. ఇపుడు పట్టించుకోవడంలేదు. ప్రజలను ఓదార్చేందుకు ఒక్క కాంగ్రెస్, బీజేపీ నేత కనిపించలేదు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ పార్టీ వ్యవహారాల్లో బిజీ గా ఉన్నారు. ప్రజలంటే వారికి పట్టింపు లేదని అన్నారు.

 

 

 


పోలవరం ప్రాజెక్టు తో భద్రాచలం కు ఉన్న ముప్పును నివారించాలి. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి మా పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. ఐదు గ్రామాల్లోని ప్రజలు తమను తెలంగాణ లో కలపాలని కోరుకుంటున్నా రని అన్నారు.ప్రభుత్వ విప్ రేగా కాంతా రావు మాట్లాడుతూ వరదల వల్ల జరిగే నష్టం నుంచి ప్రజలను శాశ్వతంగా గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ సాహాసోపేత నిర్ణయం ప్రకటించారు. వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం మామూలు విషయం కాదు. గతం లో వరదలు వచ్చినపుడు పట్టించుకున్న వారెవ్వరూ లేరు. సీఎం కేసీఆర్ కు మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల తరపున కృతజ్ఞతలు. .ఈ వరదల్లోనూ కొన్ని పార్టీల నేతలు రాజకీయం చేయడం దురదృష్టకరం. సీఎం ను రాజకీయాల కతీతంగా అందరూ అభినందించాలి. .సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేలా మేము కంకణ బద్ధులమై పని చేస్తామని అన్నారు.

 

Tags: The height of the Polavaram project should be reduced – Minister Puvvada

Leave A Reply

Your email address will not be published.