Natyam ad

 ఏనుగుల మంద బీభత్సం

విజయనగరం  ముచ్చట్లు:


పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. గంగులువాని చెరువు దగ్గర ఉన్న 2 ఆవులను, ఒక లేగ దూడను ఏనుగులు తొక్కి చంపాయి. మరోవైపు  మిర్తివలసలోనూ ఆవుల మందపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  పంట పొలాలకు వెళ్లాలంటే  భయబాంత్రులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. నాలుగు ఏళ్లుగా మన్యం వాసులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఏనుగుల దాడిలో వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని, మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.పార్వతీపురం మన్యం జిల్లా  పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలం వెంగాపురం  గ్రామంలో నాలుగు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలన్నీ నాశనం చేశాయి. విజయనగరం జిల్లా రాజాం మండలంలో ఉన్న ఈ ఏనుగురు అర్ధరాత్రి 25 కిలోమీట్లర మేర ప్రయాణం చేసి వెంగాపురం గ్రామ సమీపంలోని పంటపొలాలపై పడి పరుగులు పెట్టాయి. తొక్కి తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల అరుపులతో విషయం గుర్తించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చేతికి వచ్చిన పంటను నాశనం చేయడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. అయితే అవే ఏనుగులు మరోసారి ఆవులు, లేగదూడపై దాడి చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

 

 

 

తిరుమల కొండపై ఏనుగుల సంచారం భక్తులను కలవరపెడుతుంది. కొన్ని రోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఆదివారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫాంట్ ఆర్చ్ వద్ద 11 పెద్ద ఏనుగులు, మూడు చిన్న ఏనుగుల గుంపును చూసిన వాహనదారులు భయంతో వాహనాలను నిలిపివేసి అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోనికి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అటవీ శాఖ అధికారులు తెలిపారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఒంటరి ఏనుగు గురువారం కలకలం రేపింది. గురువారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డుకు అనుకోని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఒక్కసారిగా ఘాట్ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. ఒంటరి ఏనుగు ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్ కు సమీపంలో ఒంటరి ఏనుగు చూసిన వాహన చోదకులు వాహనాలు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజిలెన్స్ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీగా సైరన్ మోగించి ఒంటరి‌ ఏనుగును అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ అదే‌ ప్రాంతంలో ఏనుగులు సంచరించడం గమనార్హం.

 

Post Midle

Tags: The herd of elephants is devastated

Post Midle