రాజకీయాల్లోకి హీరోయిన్ సుమలత

The heroine of politics is Sumalatha

The heroine of politics is Sumalatha

Date:14/01/2019
బెంగళూరు ముచ్చట్లు:
సౌతిండియాలో ఒకప్పటి టాప్ హీరోయిన్, ప్రముఖ కన్నడ నటుడు దివంగత అంబరీష్ సతీమణి సుమలత రాజకీయాల్లోకి రానున్నారట. దీనికి సంబంధించి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. ఆదివారం మండ్యలో జరిగిన అంబరీష్ సంస్మరణ సభలో ఈ ప్రస్తావన హల్‌చల్ చేసింది. సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా చాలామంది హాజరయ్యారు. సినీ హీరో దర్శన్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, సీనియర్ నటుడు దొడ్డణ్ణలు పాల్గొన్నారు.  సుమలత రాజకీయాల్లోకి రావాలని ప్రతిపాదించారు. దీంతో అంబరీష్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోతే జేడీఎస్ నుంచి, లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలిపించుకుంటామని వారు నినాదాలు చేశారు. సుమలత కుమారుడు, సినీ హీరో అభిషేక్ సైతం తన తల్లి ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సభలో పాల్గొన్న సుమలత ఈ ప్రతిపాదనను వ్యతిరేకించకపోవడంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని అందరూ భావిస్తున్నారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Tags:The heroine of politics is Sumalatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *