లాడ్జిలలో అద్దె ఎగ్గొట్టిన హీరోయిన్

Date:24/10/2020

చెన్నై ముచ్చట్లు:

తమిళ సీనియర్ నటి విజయలక్ష్మి‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్న ఆమెపై తాజాగా పోలీస్ కేసు నమోదు కావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న విజయ్, సూర్య కలిసి గతంలో ఫ్రెండ్స్’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా విజయలక్ష్మి నటించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ కనిపించారు. తెలుగులో అర్జున్, జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’లో విజయలక్ష్మి హీరోల చెల్లి పాత్రలో మెరిశారు.ఆ తర్వాత వివిధ కారణాలతో కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఓ రాజకీయ నేత తనను వాడుకుని వదిలేశాడంటూ సంచలన ఆరోపణలు చేస్తూ మళ్లీ వెలుగులోకి వచ్చారు. తదనంతర పరిస్థితులతో బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చిన ఆమె ప్రస్తుతం తిరువన్‌మియూర్ అనే లాడ్జిలో ఉంటున్నారు. ఈ క్రమంతోనే ఓ రాజకీయ నేతతో గొడవపడి లాడ్జిలోనే ఆత్మహత్యాయత్నం చేశారు.ఆ వ్యవహారం అలా కొనసాగుతుండగానే తాజా లాడ్జి యజమాని విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కొద్ది నెలలుగా లాడ్జి అద్దె చెల్లించడం లేదని, సుమారు రూ.3లక్షల వరకు బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags: The heroine who evaded rent in lodges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *