అతనితోనే రిలేషన్ షిప్ అంటున్న హీరోయిన్

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో గాసిప్స్ పుట్టుకురావడం కామన్. అయితే కొన్ని రకాల అబద్దపు వార్తలు పర్సనల్‌గా వారికి ఇబ్బంది కలిగిస్తుంటాయి. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్, సినీ నటిఅవికా గోర్ విషయంలో అదే జరిగింది. సహ నటుడు మనీష్ రైసింఘన్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని, రహస్యంగా ఓ శిశువుకు జన్మనిచ్చిందనే వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటిపై రియాక్ట్ అయిన ఆమె.. తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెడుతూ అసలు విషయం చెప్పింది.వెండితెర, బుల్లితెరలపై రాణిస్తున్న అవికా.. ఒకానొక సమయంలో బొద్దుగా మారి అవకాశాలు కోల్పోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు క్రమంగా నాజూకు లుక్ లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే అవికా తల్లయిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మనీష్ తనకు మంచి స్నేహితుడని, అలాంటి వ్యక్తిని ముడిపెట్టి మా ఇద్దరిపై గాసిప్స్ రాయడం తీవ్రంగా బాధ పెట్టాయని ఆమె పేర్కొంది. అలా వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కన్ఫమ్ చేసిన అవికా.. హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వాణీ అనే యువకుడితో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది.

 

 

 

తీవ్రమైన మనోవేదన నుంచి బయటపడి తను మళ్లీ మామూలు మనిషిగా మారడానికి కారణం తన ప్రియుడు మిలింద్‌ చంద్వాణీనే అని ఆమె చెప్పుకొచ్చింది. అతనితో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని ఓపెన్ అయింది. తనను తాను అర్థం చేసుకోవడానికి మిలింద్‌ ఎంతో సాయ పడ్డాడని, ఆయన పాజిటివ్ ధోరణితోనే తనలో శారీరక, మానసిక మార్పులు వచ్చి తిరిగి ఇలా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపింది.చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘చిన్నారి పెళ్లికూతురు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్‌.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ”సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి, మాంజా, ఎక్కడికిపోతావు చిన్నాదాన, రాజు గారి గది 3” చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ‘థాంక్యూ’ సినిమాతో పాటు కళ్యాణ్ దేవ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో నటిస్తోంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The heroine who says she is in a relationship with him

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *