పరిపూర్ణానంద స్వామి  నగర బహిష్కరణఫై హై కోర్టు ఇచ్చిన  ఉత్తర్వులు హర్షనీయం

The High Court had ordered the expulsion of the city of Tirupurananda Swamy Harshanam

The High Court had ordered the expulsion of the city of Tirupurananda Swamy Harshanam

Date:14/08/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి నగర బహిష్కరణను నిలిపివేస్తూ హై కోర్టు ఇచ్చిన మధ్యంతరఉత్తర్వు హర్షించదగినదని ఎంపి ,మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపేర్కొన్నారు. ఈ ఉత్తర్వు ను స్వాగతిస్తున్నట్లుతెలిపారు. ఒంటెద్దు పోకడలతో లో కెసిఆర్ప్రభుత్వం  సాగిస్తున్న అప్రజాస్వామికమైన పాలనకి ఇది చెంపపెట్టు. ఓటు బ్యాంకురాజకీయాలకు పాల్పడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ కెసిఆర్ ప్రభుత్వంసాగిస్తున్న అరాచక పాలనకి ఇది ఒక హెచ్చరిక.
తాను చేసిందే చట్టమంటూ, తాను చెప్పిందేరాజ్యాంగమంటూ విర్రవీగుతున్న కెసిఆర్ కు అత్యున్నత న్యాయస్థానాలలో వరుసగా దెబ్బలుతగులుతున్నప్పటికీ  ఆయనలో మార్పు కనిపించడంలేదు. శ్రీ పరిపూర్ణానంద స్వామి   పై ఏకపక్ష నగర బహిష్కరణ విధించడం పై నోరు మెదపనికాంగ్రెస్, తెలుగుదేశం, తెరాస, వైస్సార్సీపీ, కమ్యూనిస్ట్ లాంటి కుహనా లౌకికవాద  పార్టీలుఎవరి పక్షం ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని. మజ్లీస్ పార్టీ ని  బుజ్జగిస్తూహిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న  కెసిఆర్  ప్రభుత్వానికి   ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే  శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి నగర బహిష్కరణ ను ఎత్తివేయాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేసారు.
Tags:The High Court had ordered the expulsion of the city of Tirupurananda Swamy Harshanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *