రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి  ముచ్చట్లు :
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు చెల్లించేందుకు నిధులు లేవని చెప్పడంపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే 3 రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించింది. హైకోర్టు ముందు హాజరు కావాలని ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. 2018-19 ఆర్థిక సంవత్సరలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదంటూ చిత్తూరు, తూ.గో జిల్లాకు చెందిన యర్రంరెడ్డి, ఆర్.శ్రీనివాసరావు లు హైకోర్టును ఆశ్రయించారు. నిధులు లేక బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:The High Court is outraged over the state’s financial situation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *