యథేచ్ఛగా వసూళ్ల పర్వం

The highest level of interest

The highest level of interest

 Date:10/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
గుంటూరులో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై చాలాకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఏజెంట్స్ వాహనదారులను దోచుకోవడమే పనిగా పెట్టుకోవడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తే వాహనాల రిజిస్ట్రేషన్‌తో పాటూ వెహికిల్స్ మరొకరి పేరుపై మార్చేందుకు కొందరు ఏజెంట్లు భారీగా వసూలు చేస్తున్నారు. ఈ మధ్యవర్తుల వ్యవస్థకు చెక్ పెట్టేందుకు రవాణాశాఖ ఆన్‌లైన్ సిస్టమ్‌ ప్రవేశపెట్టింది. అయినప్పటికీ పెద్దగా ఫలితం ఉండడంలేదని వాహనదారులు వాపోతున్నారు. వాహనాలకు సంబంధించి తామే  చక్కబెట్టాల్సిన పనులను రవాణాశాఖ కామన్‌ సర్వీస్‌ కేంద్రాలకు అప్పగించింది. అయితే ఈ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో పలువురికి తెలీని పరిస్థితి. సదరు సెంటర్లకు కష్టాలుపడుతూ వెళ్లేకంటే ఏజెంట్లను నమ్మకుంటే బెటరని చాలామంది భావిస్తున్నారు.
ఇక సామాన్యులు వెళ్తే పని తొందరగా కాదేమోననే భావన కూడా పలువురు మధ్యవర్తులను ఆశ్రయించడానికి కారణమవుతోంది. ఇదే అదనుగా ఏజెంట్లు దండుకునే ప్రోగ్రామ్‌కు తెరతీశారు. ఏవేవో ఫీజులు, ఖర్చులు అంటూ వాహనదారుల నుంచి దండుకుంటున్నారు. వాస్తవానికి రవాణాశాఖ పలు సంస్కరణలు చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను డీలర్ల వద్దే చేసే అవకాశం కల్పించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల సేవలను ఆన్‌లైన్‌ చేసింది. లైసెన్స్‌ల పునరుద్ధరణ, చిరునామా మార్పు, ఓనర్‌షిప్‌ బదిలీ, ఫైనాన్స్‌ నమోదు, ఫైనాన్స్‌ రద్దు.. ఈవిధంగా మొత్తం 83 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ సేవలు అందించే కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీక వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రవాణా శాఖ ఆఫీసులంటే ఆర్టీఏ ఏజెంట్లు, దళారులే గుర్తుకొస్తారు. వారికి మామూళ్లు సమర్పించుకోవడం సాధారణ వ్యవహారమే అని భావిస్తారు. ఈ దందాను అరికట్టాలని ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ఆశించిన ఫలితం ఇవ్వడంలేదని స్థానికులు అంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతమే ఎక్కువగా ముట్టజెప్పుకోవాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ చేసే డీలర్ల షోరూమ్‌ల దగ్గర నుంచి లైసెన్స్‌లు, చిరునామా మార్పు, పర్మిట్లు అన్ని రకాల సేవలు అందించాల్సిన  కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికార యంత్రాంగం ఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:The highest level of interest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed