విశాఖ జిల్లాలో కాపులకు అత్యధిక అసెంబ్లీ సీట్లు కేటాయించాలి
రాజకీయ పార్టీలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణయ్య
విశాఖపట్నం ముచ్చట్లు:
: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణయ్య డిమాండ్ చేశారు. నగరంలోని సోమవారం దసపల్లా హోటల్లో కాపు సంఘం ముఖ్యనేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ తాము ఏ పార్టీని విమర్శించబోము అన్నారు. జనాభా ప్రాతిపదికన కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని కోరుతున్నామన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నాలుగు సీట్లు కేటాయించగా, నాలుగింట విజయం సాధించామన్నారు. ఆ తరువాత టీడీపీ, తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గానికి కేటాయించిన అన్ని సీట్లు గెలుపించుకుంటూ వస్తున్నామన్నారు. భీమిలి,పెందుర్తి, గాజువాక, ఉత్తరం ఇలా అనేక నియోజకవర్గాల్లో 40శాతానికి పైగా కాపులు ఉన్నారన్నారు. ఇక జిల్లాలో కూడా చోడవరం, మాడుగులు, అనకాపల్లి, యలమంచిలితో పాటు పలు నియోజకవర్గాల్లో కాపులకు అత్యధిక శాతం ఓటింగ్ ఉందన్నారు. తక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నారని, ఇక మీదట అయినా కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులకు సంబంధించి కాపులకు సముచిత స్ధానం కల్పించాలన్నారు. కాపు,తూర్పు కాపు తామంతా ఒక్కటేనని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవున్నారు. తాము కేవలం తమ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నామన్నారు.
సంఘం కార్యదర్శి బొండా అప్పారావు మాట్లాడుతూ గ్రామ స్ధాయిలో యువతీ,యువకులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు కాపులను ఓటు బ్యాంక్‌గానే వాడుకుంటున్నారని, ఇకపై అలా కాకుండా కాపులకు సముచిత స్ధానం కల్పించాలన్నారు. విశాఖ జిల్లాలో అత్యధిక నియోజకవర్గాల్లో 40 శాతం వరకూ కాపు ఓటర్లు ఉన్నారని, వారికి కాకుండా కేవలం ఐదు నుంచి పదిశాతం ఓటు బ్యాంక్ ఉన్న వారికి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించడం సరికాదని, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సభకు కాపు సంఘం నాయకులు కంపర సత్తి బాబు అధ్యక్షత వహించి మాట్లడుతూ కాపులు ప్రాదాన్య త పెంచాలన్నారు… జనాభా పరిశీలన జరిపి పార్టీ లు నిర్ణయం తీసుకోవాలన్నారు.. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గేదెల మురళీకృష్ణ, గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడు నారాయణరావు, పెందుర్తి నాయకులు మురిపిండి సన్యాసిరావు, శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షుడు కంపర కోటేశ్వరరావు, కంచరపాలెం కొండబాబు,నాయకులు భవానీ శంకర్,వెలంశెట్టి శ్రీనివాసరావు, జీ. సుబ్రమణ్యం, ముక్కా శివాజి, గొల్కొండ శ్రీనివాసరావు, అక్కిరెడ్డి నాగరాజు దవల మోహన్, సాలా పు రమణ…తదితరులు పాల్గొన్నారు.
Tags: The highest number of assembly seats should be allotted to farmers in Visakhapatnam district