శ్రీ‌వారి ఆల‌య చ‌రిత్ర‌ను విశ్వ‌వ్యాప్తం

The history of the Shrivari Temple is universal

The history of the Shrivari Temple is universal

– మ‌హ‌నీయుడు   సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి :

-టిటిడి తిరుప‌తి జెఈవో   పి.బ‌సంత్‌కుమార్‌

Date:10/09/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను,  వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు   సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని టిటిడి తిరుప‌తి జెఈవో   పి.బ‌సంత్‌కుమార్ కొనియాడారు.  సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి 38వ వ‌ర్ధంతి వేడుక‌లు మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా శ్వేత భ‌వనం ఎదురుగా గ‌ల ఆయ‌న కాంస్య విగ్ర‌హానికి జెఈవోతోపాటు శ్వేత ఇన్‌చార్జి సంచాల‌కులు   శేష శైలేంద్ర త‌దిత‌రులు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

 

 

అనంత‌రం వెంగ‌మాంబ స‌మావేశ మందిరంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జెఈవో మాట్లాడుతూ   సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. ఆయ‌న సేవ‌ల‌ను ప్ర‌తి ఏడాదీ స్మ‌రించుకుంటున్నామ‌ని వివ‌రించారు. శ్వేత ఇన్‌చార్జి సంచాల‌కులు   శేష శైలేంద్ర మాట్లాడుతూ శాస్త్రి  శాస‌నాల‌ను ప‌రిష్క‌రించి నాటి చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందించార‌ని తెలిపారు. ఆ త‌రువాత ఎస్వీయు తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య కె.స‌ర్వోత్త‌మ‌రావు  సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి జీవిత విశేషాల‌ను వివ‌రించారు.

 

 

 

ఈ సందర్భంగా  సాధు సుబ్రమణ్యశాస్త్రి కుమార్తె  గిరిజాదేవి, మనవడు, కడప ప్రిన్సిపల్ సీనియ‌ర్ సివిల్ జడ్జి   సిఎన్.మూర్తిని జెఈవో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో   సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి స‌హ ప‌రిశోధ‌కులు   ఎస్‌.కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కారంలో ముందంజ

Tags: The history of the Shrivari Temple is universal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *