Natyam ad

ఉయ్యాలవాడ చరిత్ర చిరస్మరణీయం- మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

స్వాతంత్య్ర సమరయోధుడు , బ్రిటిష్‌ పాలకులకు సింహస్వప్నంగా ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర చిరస్మరణీయమని ఆయన సేవలు మరువలేనిదని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని యుఎన్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్ సభ్యులు సుమారు రూ.30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కలసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 1946లో బ్రిటిష్‌ పాలకులకు ఎదురొడ్డి పోరాటం చేశారని కొనియాడారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ విగ్రహాన్ని యుఎన్‌ఆర్‌ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆయన చరిత్రను మంత్రి వివరించారు. ఎంపీ మిధున్‌రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పుంగనూరు ప్రజల కీర్తిని చాటుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిని, ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ద్వాకరనాథరెడ్డి లను ట్రస్ట్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ట్రస్ట్ సభ్యులు డాక్టర్‌ శరణ్‌, త్రిమూర్తిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: The history of Uyyalawada is immortal – Minister Peddireddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.