పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ కనకదుర్గా ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం నాడు పూర్ణాహుతిలో ముగిసాయి. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిసాయి. మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించాం. ఏడాది పొడుగునా తెలిసీ తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఆలయం లోని అన్ని దేవతామూర్తులకు ధరింప చేసిన పవిత్రాలను మనం ధరిస్తే మంచి జరుగుతుందని పూర్వీకుల విశ్వాసం. పవిత్రోత్సవాలు నిర్వహించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు భక్తులపై ఉంటాయని అన్నారు.
Tags: The holy festivals ended with Purnahuti

