The hope is to help the poor students

పేద విద్యార్థులను ఆదుకోవడమే ఆశయం

Date:23/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పేదరికంలో ఉంటు ఉన్నత చదువులు చదివే విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యమని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు చాంద్‌బాషా తెలిపారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఉన్నత చదువులు చదువుతున్న 16 మంది విద్యార్థులకు రూ.33 వేలు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యేటా తమ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు , పేద ప్రజలకు వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు హాఫిజ్‌అతావుల్లా, మదుబాబు, జహుర్‌బాషా, అన్వర్‌బాషా, ఖాదర్‌, ఫయాజ్‌, యూసఫ్‌, ఖమ్రు, జబి, అతిక్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరుకు వేసవిలో జలకళ

Tags: The hope is to help the poor students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *