The huge hopes on Mahesh movie

 మహేష్  మూవీపై భారీ ఆశలు

Date:04/05/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో.. గ్లామరస్ బ్యూటీ హీరోయిన్.. స్టార్ దర్శకుడు.. టాప్ ప్రొడ్యుసర్లు ఒక్కరు కాదు ముగ్గురు.. రాక్ స్టార్ మ్యూజిక్.. కెమెరామాంత్రికుడు సినిమాటోగ్రఫీ.. ఈ క్రేజీ కాంబో అంతా ‘మహర్షి’ చిత్రానికి పనిచేయడంతో టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్‌ మూవీగా మారింది ‘మమర్షి’ చిత్రం. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ చిత్రం భారీ అంచనాల నడుమ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ కెరియర్‌లో 25వ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రేజీ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు ‘మహర్షి’ చిత్రానికి హైప్ తీసుకురావడంతో ఈ మూవీపై అభిమానాలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ మళ్లీ హిట్ కొట్టబోతున్నాడనే కాన్ఫిడెన్స్‌తో ఆయన ఫ్యాన్, మహర్షి చిత్రయూనిట్ ఉన్న నేపథ్యంలో ‘మహర్షి’ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్ నుండి మంచి స్పందన రావ‌డంతో దర్శక నిర్మాతలు ఊపిరి దర్శకుడు ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణ మధ్య తరగతి యువకుడు బిలీనియర్‌గా ఎదగడం.. తిరిగి రైతుగా మారడం లాంటి ఆసక్తికరమైన అంశాలను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా ‘మహర్షి’ చిత్రాన్ని రూపొందించారట దర్శకుడు వంశీ పైడిపల్లి.2.55 గంటల నిడివితో ఉన్న ఈ చిత్రంలో మహేష్‌ని స్టూడెంట్‌గా, బిలీనియర్‌గా, రైతుగా మూడు వైవిధ్యభరిత పాత్రల్లో మెస్మరైజ్ చేసేలా చూపించారట. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన తరువాత ప్రేక్షకులు బరువెక్కిన గుండెలతో థియేటర్స్ బయటకు వస్తారని ఎమోషనల్‌గా సాగే క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే గ్లామరస్ షో మాస్ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉందని.. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌లో మహేష్ ఉగ్రరూపం చూపించాడంటున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ విషయానికి వస్తే.. మొత్తం ఆరు సాంగ్స్‌లో నాలుగు మాంటేజ్ సాంగ్స్ ఉండటాన్ని ఇది కథా ప్రాధాన్యం ఉన్న చిత్రం అంటున్నారు. మిగిలిన రెండు పాటల్లో ‘పాలపిట్ట’ సాంగ్‌లో హైలైట్ కానుందని.. ఈ సాంగ్‌లో పూజా అందాలతో కనువిందు చేసిందంటున్నారు. మొత్తంగా సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని.. మహేష్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్. అయితే మహర్షి సినిమాలో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమా ఛాయలు కనిపిస్తుండటం.. సాంగ్స్ కూడా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ కాకపోవడం లాంటి అంశాలు ‘మహర్షి’ని గట్టిక్కిస్తాయో లేదో మే 9న తేలిపోనుంది.
Tags: The huge hopes on Mahesh movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *