పులి కోసం గాలింపు

అనకాపల్లి ముచ్చట్లు:


అనకాపల్లి జిల్లాలో పులికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని విశాఖ సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి‌.రామ్మోహనరావు తెలిపారు.పులిని ట్రాప్ చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి బోను సిద్దం చేస్తున్నామని,అనంతగిరి మీదుగా మరింత కొండలపైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.పాపికొండల నుంచి కాకుడాం ఒడిశా , ఛత్తీస్ ఘడ్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. పసుపోషణ ఎక్కువగా ఉండే ప్రాంతాలను అన్వేషిస్తూ కేవలం ఆహారం కోసమే వస్తోందని,పులి నుంచి స్వీయరక్షణ కోసం ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.పశువులు నష్టపోయిన  యజమానులకు తక్షణం పరిహారాన్ని చెల్లిస్తున్నామని చెప్పారు.

 

Tags: The hunt for the tiger

Leave A Reply

Your email address will not be published.