గాడిలో పడని హైద్రాబాద్ కాంగ్రెస్

Can you do it? (West)

Can you do it? (West)

Date:17/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ పార్టీ గాడిలో పడడం లేదా?  కాంగ్రెస్ సీనియర్లతో అంజన్ కుమార్ కు పొసగడం లేదా? హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ ముఖ్యుల మధ్య సమన్వయం సాధించడంలో ఇటు నగర పార్టీ అధ్యక్షుడు అటు పిసిసి చీఫ్ విఫలమవుతున్నారా? సికింద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయాలని ఉందంటూ ప్రముఖ క్రికెటర్ , కాంగ్రెస్ మాజీ ఎంపీ అజహరుద్దీన్  ప్రకటించడం వెనకున్న సీనియర్ నేత ఎవరు?ఇంతకీ హైదరాబాద్ కాంగ్రెస్ లో ఎం జరుగుతుంది?హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ నగరంలో ఇంకా పార్టీ గాడిలో పడలేదనే హస్తం నేతల్లో చర్చ జరుగుతుంది.ఇప్పటికే నగర కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తరస్థాయిలో ఉన్నాయి దానికి తోడు హైదరాబాద్ కాంగ్రెస్ అద్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ప్రకటించడంతో అగ్ని కి ఆజ్యం పోసినట్లు అయింది.దింతో వర్గ విబేధాలు నగర కాంగ్రెస్ లో కట్టలు తెంచుకున్నాయి.అసలు అజారుద్దీన్ కి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలనే ఉద్దేశం లేదని,అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ గల్లంతు అయినా నేతనే అజార్ ను వెనకనుండి నడిపిస్తున్నారని పార్టీ నేతలే మండిపడుతున్నారు. సీనియర్ నేతనని చెప్పుకుంటూ ఆ సదరు నేత, పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని,హైదరాబాద్ లో అసలు ఆ నేతకు ప్రజాబలమే లేదని కానీ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానని,హై కమాండ్ తనకు దగ్గరని మిగతా నేతల,అనుచరుల వద్ద గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లబోస్తుంటాడాని అందుకే గత ఎన్నికల్లో ఆ నేతను ప్రజలు చిత్తుగా ఓడించారని నగర పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఇక తన పరిస్థితి అలాగా ఉంటే గతంలో ఉత్తరప్రదేశ్,రాజస్థాన్ లో పోటీ చేసిన అజర్ ను కావాలని సికింద్రాబాద్ కు రావాలని వెనుక నుండి ప్రోత్సాహిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.అయితే అంజన్ కుమార్ యాదవ్ ను హైదరాబాద్ అధ్యక్షుడి గా హైకమాండ్ ప్రకటించడం ఆ సీనియర్ నేతకు రుచించకనే అంజన్ ను ఇబ్బందిపాలు చేయడానికే ఇలా అజర్ ను తెర మీదకు తీసుకరవడాని ఆ నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.అసలే గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క సిటు కూడా హస్తం పార్టీ దక్కించుకోలేదు..అటు హైదరాబాద్ ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 14 అసంబ్లీ  నియోజకవర్గ లు ఉన్నాయి..దాదాపు 6 నుండి 7 నియోజకవర్గలో ఎంఐఎం ప్రాబల్యం ఉంటుంది.ఇక 7 నుండి 8 నియోజకవర్గలో పార్టీ ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉన్న పెద్దగా పార్టీ నేతలు దృష్టి సరించిండం లేరు అసలు కొన్ని నియోజకవర్గలో అభ్యర్థులే లేని పరిస్థితి కనబడుతుంది..ఇక కొన్ని నియోజకవర్గలో అంత బలమైన నాయకులు లేకున్నా ఉన్న నేతలోనే గ్రూప్ తగాదాలు ఉన్నాయి.దానం నాగేందర్ పార్టీ ని వదిలి గులాబీ గూటికి చేరడంతో ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు అనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి,ఇక అంతో ఇంతో హైదరాబాద్ లో బలంగా ఉన్న నేతలు సనత్ నగర్ నుండి మర్రిశశిధర్ రెడ్డి,జూబ్లీహిల్స్ నుండి విష్ణువర్ధన్ రెడ్డి లు ఉన్నారు గతంలో వీరు ఎమ్మెల్యే లుగా పని చేసారు.. ఇక గోశామహల్ లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఉన్న అతను పూర్తిగా పార్టీ కార్యక్రమలకు దూరంగా ఉన్నారు ఏ పార్టీలో కొనసాగుతారో తెలియని పరిస్థితి  అతనిలో నెలకొంది..ఇక ముషీరాబాద్ అసంబ్లీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అంజయ్య మనవడు అభిషేక్ రెడ్డి తో పాటు గా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా పోటీ పడుతున్నారు అయితే గత ఎన్నికల్లో మాజీ కేంద్రమంత్రి శివశంకర్ కుమారుడు వినయ్ పోటీ చేసి ఓటమి పాలైన్నారు.అంబర్ పెట్ నియోజకవర్గలో కాంగ్రెస్ సీనియర్ నేత కు గత ఎన్నికలో డిపాజిట్ కూడా రాలేదు.ఇక ఇప్పుడు ఆ నియోజకవర్గనికి అభ్యర్థి ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి. కాగా సికింద్రాబాద్ లో బండ కార్తీక రెడ్డి,ఆదమ్ సంతోష్ లు.. కొంటోన్మెంట్ లో క్రిషశాంక్,శ్రీ గణేష్,గద్దర్ కుమారుడు సూర్య లు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.కాగా నాంపల్లి లో టికెట్ వస్తుందో రాదోననే ఆందోళనలో ఫిరోజ్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తుంది..ఇలా కొన్ని నియోజకవర్గ లో అభ్యర్థులు లేక, ఇక కొన్ని నియోజకవర్గ లో నేతల మధ్య వర్గ పోరు ఉన్న వాటిని పరిష్కరించే దశగా అటు పీసీసీ ముఖ్యనేత గాని ఇటు హైదరాబాద్ అధ్యక్షుడు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేరని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి.పీసీసీ తన అనుచరులకు టికెట్స్ ఇప్పించుకునే తపత్రయంలో ఉన్నారు కానీ,నగర పార్టీలో ఉన్న వర్గ విభేదాలను రూపుమాపి పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కృషి చేయడం లేరనే అపవాదు ఉంది..ఇకనైనా పీసీసీ, నగర అధ్యక్షుడు సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్  పార్టీ లో ఉన్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి..హస్తం పార్టీకి పూర్వ వైభవం తేవాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి.
గాడిలో పడని హైద్రాబాద్ కాంగ్రెస్ https://www.telugumuchatlu.com/the-hyderabad-congress-is-not-in-the-groove/
Tags:The Hyderabad Congress is not in the groove

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *