హైల్త్ రికార్డ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి

The Hythe Records should complete the digitization process

The Hythe Records should complete the digitization process

Date:31/12/2018
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
జిల్లాలో హైల్త్ రికార్డ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ ను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాష వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమలకు ముందు జెసిఅన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సంక్షేమ కార్యక్రమాలపై సమిక్షించారు. ఈ సందర్భంగా జెసి పలు అంశాలపై అధికారులకు మార్గదర్శనం చేశారు. హెల్త్  రికార్డ్స్ డిజిటలైజేషన్ కు పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 98.74 శాతం మందికి సంబంధించిన హైల్త్ రికార్డ్స్ నమెదు పూర్తి అయ్యాయి. మిగతా ప్రక్రియను అతిత్వరగా పూర్తి చేసి రిపోర్టును అందించాలని అన్నారు.
పదవ తరగతి విద్యార్ధులకు నవంబర్ నుంచి ప్రత్యేక క్లాస్ లు ప్రారంభించి,  విద్యార్ధులకు అల్పాహరం అందించే కార్యక్రమం అమలు చేయలేకపోవడం పై జెసి డిఈఒ రాధకిషన్ ను ప్రశ్నించారు. దాతల సహకారం ప్రభుత్వ అధికారులు సహకారంతో గోరుముద్దను ప్రారంభించారు.  సంక్షేమ వసతి గృహలలోని విద్యార్ధులకు మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు భూ సేకరణకు సంబంధించి ఎమైనా ఇబ్బందులు ఉంటే ప్రతి సోమవారం జరిగే ప్రజావాహిణిలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న మదర్ చైల్డ్ ఆస్పత్రికి అనువైన స్థలం ను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్  రాహుల్ శర్మ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:The Hythe Records should complete the digitization process

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed