విద్యుత్ మోటార్లు బిగించే ఆలోచన విరమించుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల  డిమాండ్

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల పట్టణంలో సోమవారం నాడు  స్థానిక సాయిబాబా నగర్ లోని సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం కార్యదర్శి జి. సోమన్న అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగాసిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్   సిపిఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్సిపిఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ) కార్యదర్శి శంకర్  టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చింతలయ్య  ఉపాధ్యక్షులు ఆనంద రావు  ఎఐటియుసి పట్టణ కార్యదర్శి డి. శ్రీనివాసులు  ఎఐ యస్ ప్ . కర్నూలు జిల్లా ఉమ్మడి అధ్యక్షులు ఎ. సురేష్ . పాల్గొన్నారు . అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి   కేంద్ర ప్రభుత్వం  ప్రధాని మోడీ  ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వము వ్యవసాయం నల్ల చట్టాలను రైతుల మీద ఉపయోగించి తర్వాత రైతులకు క్షమాపణ చెప్పడం జరిగింది.పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కేరళ తమిళనాడు రాష్ట్రాల కంటే ముందుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఫైలెట్ ప్రాజెక్టు పేరుతో శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టి రాష్ట్రమంతటా విస్తరింప చేయాలని ఆలోచనను విరమించుకోవాలని కోరారు.అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో మొరపెట్టినా పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి  రైతుల పంపుసెట్లకు విద్యుత్ మోటార్లు బిగించి రైతుల మెడకు ఉరి బిగించడం మే అన్నారు.ఈ కారణంతో రైతులకు ఇచ్చే సబ్సిడీలు   ఉచిత విద్యుత్ కోల్పోవడం జరుగుతుందన్నారు.
రైతుల పంపుసెట్లకువిద్యుత్ మోటార్లు బిగించే ఆలోచనను విరమించుకోవాలని లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతులు వెంకటేశ్వర్లు సుబ్బయ్య రాముడు తదితరులు పాల్గొనడం జరిగింది.

 

Tags:The idea of fitting electric motors should be abandoned

Leave A Reply

Your email address will not be published.