శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జరుగనున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.ఇందులోభాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్   శేషగిరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్   రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: The incarnations of Sri Sundararajaswamy begin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *