ఘటన ఎంతో కలవరించింది

విజయవాడ  ముచ్చట్లు :
తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నర్సింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు అర్ధరాత్రి కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే.. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు గట్టిగా నమ్మే వ్యక్తిని తానని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.మహిళల భద్రత కోసం దిశ, అభయం యాప్‌లతో పాటు వారి రక్షణ కోసం దిశ చట్టం చేసినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో మహిళా పోలీసులను నియమించామని.. మహిళల కోసం ప్రత్యేకంగా 900 మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ తెలిపారు.ప్రకాశం బ్యారేజీ వద్ద అత్యచార ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని సీఎం జగన్ వెల్లడించారు. ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తూ.. భవిష్యత్తులో పునవృతం కాకుండా ఉండేందుకు ఇంకా ఎక్కువగా కష్టపడతానని చెప్పారు. కాగా, ఇప్పటికే డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను సీఎం జగన్‌ సోమవారం తన క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:The incident was very disturbing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *