భారత ఆర్థిక వ్యవస్థకు జబ్బుచేసింది

The Indian economy is sick

The Indian economy is sick

Date: 09/12/2019

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

భారత ఆర్థిక వ్యవస్థకు జబ్బుచేసిందని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా పని చేసిన అనుభవం.. మన్మోహన్.. మోడీ హయాంలోనూ విధులు నిర్వర్తించిన రఘురామ్ రాజన్ కు పాలనలో దొర్లుతున్న తప్పుల మీద అవగాహన ఉందని చెప్పక తప్పదు. మోడీ లాంటి బలమైన నేత ప్రధానిగా ఉండి.. భారీ మెజార్టీతో సుస్థిర ప్రభుత్వం కొలువు తీరి ఉన్నా.. ఆర్థిక రంగం వృద్ధి చెందకుండా ఎందుకు ఉంది? లోపం ఎక్కడ ఉంది? ఆర్థిక వ్యవస్థ తీవ్ర రుగ్మతులతో సతమతమవుతోందన్న భావన ఎందుకు వ్యక్తమవుతోంది? లాంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పేశారు. తాజాగా ఆయన ఒక మీడియా సంస్థకు రాసిన వ్యాసంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వెనుక అసలు లెక్కల్ని వివరించే ప్రయత్నం చేశారు. వృద్ధి మాంద్యం అంటూ ఆయన పేర్కొన్న అంశాన్ని వివరించారు. ఇంతకూ దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటన్నది ఆయన మాటల్లోనే చూస్తే..  ప్రస్తుత ప్రభుత్వంతో సమస్యేమిటంటే .. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. నిర్ణయాలే కాదు.. ఆలోచనలు ప్రణాళికలు.. అన్నీ కూడా ప్రధాని చుట్టూ ఉండే కొద్ది మంది ప్రధాని కార్యాలయం నుంచి వస్తుంటాయి. ఒక పార్టీ రాజకీయ సామాజిక ఎజెండాను అమలు చేయడానికి ఇలాంటి విధానం పనికొస్తుంది కానీ.. ఆర్థిక సంస్కరణల విషయంలో ఇది పనిచేయదు.

 

 

 

 

 

 

 

పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారు. ఇలాంటి పాలనతో ఆర్థిక రంగం తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోంది. విమర్శించే ప్రతి ఒక్కరికీ రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం మానుకోవాలి. దేశం వృద్ధి మాంద్య పరిస్థితుల మధ్యలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఒత్తిడి ఉంది. రియల్ ఎస్టేట్ నిర్మాణ ఇన్ఫ్రా రంగాలు.. వాటికి రుణాలిచ్చిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సంక్షోభంలో ఉన్నాయి.   దేశాన్ని గట్టెక్కించాలంటే పెట్టుబడులు భూ.. కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. అదే చేస్తే పెట్టుబడులతో పాటు వృద్ధికి కూడా ఊతం లభించగలదు.దేశ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి పోటీ దేశాలకు దీటుగా ఎదగడానికి .. ఉపయుక్తంగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టాలి.

 

 

 

 

 

 

 

 

గత ప్రభుత్వాలు సంకీర్ణంగా నడిచినప్పటికీ.. ఆర్థిక విధానాల సరళీకరణను స్థిరంగా ముందుకు తీసుకెళ్లాయన్నారు. తీవ్ర స్థాయిలో అధికార కేంద్రీకరణ మంత్రులకు అధికారాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా.. పీఎంవో దృష్టి పెట్టినప్పుడు మాత్రమే సంస్కరణలు జోరందుకుంటున్నాయి. పీఎంవో దృష్టి మిగతా అంశాలవైపు మళ్లిన మరుక్షణం.. సంస్కరణల జోరూ తగ్గిపోతోంది. ఆర్థిక మందగమనానికి మందు కనుగొనాలంటే.. ముందుగా సమస్య తీవ్రతను గుర్తించడం దగ్గర్నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది.   సమస్య పరిమాణాన్ని గుర్తించాలి. సమస్య తాత్కాలికమేనని.. ప్రతికూల వార్తలు – అననుకూల సర్వేలను తొక్కి పెట్టి ఉంచితే అది పరిష్కారమైపోతుందనే ఆలోచనల నుంచి బైటికి రావాలి. సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అందరి రుణభారం యువతలో నిరుద్యోగిత పెరిగిపోతోంది. భూ సమీకరణ కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు స్థిరమైన పన్నులు.. నియంత్రణా వ్యవస్థల విధానాలు అమలు చేయాలి.

 

భీమవరం టాకీస్ 98వ చిత్రం  శివ 143 ఫస్ట్ లుక్ & ట్రైలర్ విడుదల

 

Tags:The Indian economy is sick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *