Natyam ad

ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి

ములకలచెరువు ముచ్చట్లు:

 

ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి, నియోజక వర్గంలోని మొలకల చెరువు మండలం, బురకాయలకోట, పంచాయతీ, బలకవారిపల్లికి చెందిన సుదర్శన్ రెడ్డికి ఒక్కగా నోక్క కొడుకు జశ్వంత్ రెడ్డి(19). మదనపల్లిలో ఇంటర్ చదవుతున్న  జశ్వంత్ రెడ్డి మంగళవారం తన బైకులో బలకవారిపల్లి నుండి బురకాయలకోటకు సొంత పనిపై వెళ్తుండగా మార్గ మధ్యంలోని సెంట్రల్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకొన్న విషయం తెలిసిందే. బాదితున్ని ఆదే రోజే మదనపల్లికి తరలించి అక్కడ నుంచీ బెంగుళూరు తీసుకెళ్లి వైద్యం చేయించిన ఫలితం లేకుండా పోయింది. తిరిగి రాత్రి మదనపల్లి జిల్లా ఆస్పత్రికి జశ్వంత్ ను తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. శుక్రవారం ఉదయం విద్యార్థి జస్వంత్ కన్ను మూశాడు. ములకలచెరువు ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Post Midle

Tags: The injured student died in the accident

Post Midle