సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదామును ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి  జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల ముచ్చట్లు :

జిల్లాల అవిర్బావం అనంతరం జిల్లా ప్రధాన కార్యాలయాలు అన్ని ఒకే చోట సమీకృతమై ఉండేలా రూపుదిద్దుకున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయను ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. బుధవారం భవన చివరి దశ నిర్మాణ మరియు సుందరీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, భవనం ప్రహరి నాలుగు వైపుల మూడు వరుసలలో వివిధ రకాల మొక్కలను నాటాలని, ఖాళీప్రదేశాలలో మియావాకి పద్దతిలో మొక్కలు నాటేలా చూడాలని, కార్యాలయానికి వచ్చే అధికారుల, ఇతరుల వాహనాల పార్కింగ్ లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నాటేమొక్కలు చిన్నవి కాకుండా పెద్దమొక్కలను నాటేలా చూడాలని అన్నారు.
రోడ్డు మొదలుకొని కార్యాలయానికి  వచ్చే మార్గంలో ఆకర్శనీయంగా ఉండేలా వివిధ  పూల మొక్కలను నాటాలని, మురుగుకాలువ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, శాశ్వత ప్రాతిపదికన హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టేలా చూడాలని, కార్యాలయ భవనం ముందు లోపల అనవసర నిర్మాణాలను తొలగించాలని, రోడ్డు నిర్మాణం సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు  తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ  మాధురి, ఈఈ ఆర్ ఆండ్ బి  శ్రీనివాస్ రావు, అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమీషన్ మారుతి ప్రసాద్, తహసీల్దార్ వెంకటేష్ ఇతర అధికారుల పాల్గోన్నారు.

 

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:The Integrated District Office Building Complex should be prepared for the inauguration
District Collector G. Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *