ఏకలవ్యుని విగ్రహ ఆవిష్కరణ

The invention of the monolithic idol

The invention of the monolithic idol

Date:09/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని ఎం.గొల్లపల్లె గ్రామంలో శనివారం ఎరుకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఏకలవ్యుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జిల్లాలోనే వెహోదటిసారిగా ఏకలవ్యుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి , పూలమాలలు వేయడం జరిగిందన్నారు. అలాగే స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు గడుస్తున్నా ఎరుకుల కులం వారు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇకనైన ఐకమత్యంతో ఉండి ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటి సభ్యులు ఎం.ఈశ్వరప్ప, రామకృష్ణ, జి.అమరప్ప, సాకే చిరంజీవి, గంగన్న, డి.శంకర్‌రావు, కిరణ్‌, సుగుణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

10న స్కూల్‌ అసిస్టెంట్ల డివిజన్‌ సమావేశం

Tags: The invention of the monolithic idol

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *