The Janata curfew continued for the second day

రెండవ రోజు కొనసాగిన జనతా కర్ఫ్యూ

– యధావిధిగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
– షాపులు బంద్‌
– సంత రద్దు

Date:23/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

నిత్యం వేలాది మందితో కళకళలాడే పుంగనూరు పట్టణంలో రెండవ రోజు కూడ జనతా కర్ఫ్యూ కొనసాగింది. సోమవారం సంత కావడం, ఈనెల 25న ఉగాధి పండుగ రావడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ అవసరాల కోసం పట్టణం చేరుకున్నారు. కర్ఫ్యూ గురించి తెలియక ఒకే రోజు బంద్‌ అనుకుని వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ , సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు ఉమామహేశ్వరరావు, తిప్పేస్వామి కలసి ఉబేదుల్లా కాంపౌండులో నిర్వహించే సంతను ఎత్తివేయించారు. వ్యాపారులు విరుద్ధంగా మాట్లాడటంతో పోలీసులు, మున్సిపల్‌ ఉద్యోగులు, వలంటీర్లు కలసి వారికి నమస్కారం పెట్టి ఈనెలాఖరు వరకు సంతను రద్దు చేస్తున్నామని , వ్యాపారులు సహకరించాలని మర్యాద పూర్వకంగా వివరించారు. కూరగాయలు విక్రయించకపోతే పాడైపోతుందని, దీని ద్వారా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కానీ వ్యాపారులను బ్రతిమలాడి సంతను రద్దు చేసి, పంపేశారు. అలాగే నిత్యవసర వస్తువుల దుకాణాలు, మందులషాపులు, మినహా అన్ని షాపులను మూసివేయించారు. పట్టణంలోని అన్నివీధులలో బ్లీచింగ్‌, ఫినాయిల్‌, మోలా•న్‌ స్ప్రే చేశారు. అలాగే ట్రాక్టర్‌ ట్యాంకర్లతో సోడియం క్లోరైడ్‌ను కలిపి రోడ్ల•పై పిచికారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో అన్ని విధాలుగా ప్రచారం చేపడుతున్నామని, ఈనెల 31 వరకు ప్రజలు ఇండ్లలో నుంచి బయట రారాదని ప్రజలు కరోనా వ్యాదిని నియంత్రించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, మున్సిపల్‌ ఉద్యోగులు తిరుమలరావు, జి.శ్రీనివాసులు, శ్రీనివాసులు, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 31 వరకు ప్రజారవాణా నిలిపివేత

Tags: The Janata curfew continued for the second day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *