మేకపోతు తెచ్చిన తంటా……

–100 అడుగుల లోయలోకి జారిపడిన యువ భక్తుడు
— యువకుడిని బయటకు తీసిన పోలీసులు, ఫైర్‌ సిబ్బంది
— స్వల్పగాయాలతో బయటకపడ్డ భక్తుడు

చౌడేపల్లె ముచ్చట్లు:


మేకపోతు తెచ్చిన తంట యువకుడు గణేష్‌ బోయకొండ ఆలయం వద్ద గల చిత్తారి కోటకు దక్షిణం వైపు గల లోయలోకి ప్రమాదవశాత్తు జారిపడిన సంఘటన మంగళవారం చోటుచేసుకొంది. ఎస్‌ఐ రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలాఉన్నాయి…. అమ్మవారి దర్శనం కోసం తిరుపతి పట్టణం సప్తగిరినగర్‌,కెటి రోడ్డులో నివాసమున్న ఎన్‌. కుమార్‌ కుటుంబ సమేతంగా , బంధువులతో కలిసి మంగళవారం బోయకొండ గంగమ్మకు వెహోక్కులు తీర్చడానికి వచ్చారు. అమ్మవారికి పూజలు చేసి జంతుబలి సమర్పించడానికి మేకపోతును తీసుకొని ఆలయం వద్దకు చేరుకొన్నారు. ఇంతలో మేకపోతు అక్కడినుంచి పరారై తప్పించుకొంది. మేకపోతు వెంట గణేష్‌(19) యువకుడు తోపాటు బోయకొండలో మటన్‌ కత్తరించే కూలీ మంజు ఇద్దరు మేకను పట్టుకొనేందుకు వెళ్ళారు. మేకపోతు బోయకొండ ఆలయంలో చిత్తారికోట సమీపంలో లోయ వద్ద గల బండ పై మేకను పట్టుకొనే క్రమంలో గణేష్‌ ప్రమాదవశాత్తు జారి వంద అడుగుల లోయలోకి జారిపడ్డారు.వెంట వెళ్లిన మంజు గమనించి ఎస్‌ఐ రవికుమార్‌ కు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ రాజేష్‌ తాళ్ల సహాయంతో చాకచక్యంగా లోయలోకి దిగి గణేష్‌కు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇంతలో పుంగనూరునుంచి పైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి తాళ్ళ సహయంతో లోయలోనుంచి వెలికి తీశారు.స్వల్ప గాయాలతో బయటపడిన క్షతగాత్రుడిని ప్రభుత్వ వైద్య కేంద్రంలో ప్రథమచికి త్స అందించి కుటుంభీకులకు అప్పగించారు. బాధితుడిని ఆలయ కమిటిచైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ పరామర్శించారు. అమ్మవారి మహిమ వలనే తమ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారని బాధితుడి కుటుంభీకులు పేర్కొన్నారు.

Tags: The kick brought by the goat

Leave A Reply

Your email address will not be published.