పోలీసుల విచారణ లో వీడుతున్న కిడ్నీ రాకెట్ దందా.. లింక్స్?..

-అంగట్లో కిడ్నీలు.. కేరళ టూ హైదరాబాద్..

కేరళ ముచ్చట్లు:


కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారిన కిడ్నీ అమ్మకాల బాగోతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.డబ్బు ఆశచూపి పేదలను టార్గెట్ చేస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది.కొచ్చీలో కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతి చెందడంతో విషయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లయింట్ తో తీగ లాగితే.హైదరాబాద్ లో డొంక కదిలింది.కేరళ, హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు ఈ దందా చేస్తున్నట్లు తేలింది.ఈ ముఠాలను నడిపించే మాస్టర్‌ మైండ్‌ హైదరాబాద్‌కు చెందిన వైద్యుడని తేలింది.కిడ్నీ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.అసలు అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌కు సూత్రధారి హైదరాబాద్ కు చెందిన వైద్యుడేనా..?

 

 

అతనికి సహకరించిన ముఠా సభ్యులు ఎవ్వరు..?కేరళాలో వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ కు హైదరాబాద్ లింక్స్ ఎంటీ..?ఎలా బయటపడ్డాయి..?అసలు ఈ కిడ్నీ రాకుట్ ముఠా సభ్యులు ఎలా మానిటరింగ్ చేసి ఈ ఆపరేషన్ చేశారు..?అనే కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు.యువకుడు మరణించడంతో ఈ వ్యవహారం మొత్తం తెరపైకి వచ్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సబిత్ ను అరెస్ట్ చేసి కీలక విషయాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్యాంగ్ లో హైదరాబాద్ కు చెందిన ఓ వైద్యుడు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సబిత్ కన్ఫెషన్ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా హైదరాబాద్ కు చెందిన వారినే ఎక్కువగా ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మినట్లు కూడా పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

హైదరాబాద్ కేంద్రంగానే ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ అంతా నడుస్తున్నట్లు కేరళ పోలీసులు చెబుతున్నారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం కూడా ఉందని కేరళ పోలీసులు గుర్తించారు. ఈ కేసును చేధించడానికి ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా ఆధ్వర్యంలోని సిట్‌ బృందం హైదరాబాద్‌ చేరుకుంది. విచారణ స్టార్ట్ చేసింది.దీంతో హైదరాబాద్ కు చెందిన వైద్యుడు ఎవ్వరు..? బాధితులు ఎవ్వరనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ నుండి ఓ ప్రత్యేక టీమ్ హైదరాబాద్‌కు వచ్చి దర్యాప్తు చేస్తుందనే ప్రచారం జరగుతున్నా, రాష్ట్ర పోలీసు అధికారులు మాత్రం ఆ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. మరోవైపు NIA రంగంలోకి దిగింది. కేరళలో నమోదైన FIR ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారి మరో ఇద్దరి కోసం గాలిస్తుంది.

 

Tags:The kidney racket that is being released in the police investigation.. Lynx?..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *