సోమల లో కోవిడ్ వ్యాక్సిన్ మొదటివిడత ప్రారంభం

Date:16/01/2021

సోమల ముచ్చట్లు:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శనివారం ఉదయం మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సి నేషన్ కు ఆరోగ్య యంత్రాంగం సన్నద్ద మైందని డాక్టర్ మానసా తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ వాక్సినేషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం తొలిసారిగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రకియ ప్రారంభమైంది. ఈకార్యక్రమం పుంగనూరు నియోజక వర్గ పరిధిలోని సోమల మరియు చౌడేపల్లి సెషన్ సైట్స్ లొ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ సెషన్ సైట్ లో 5 మంది వ్యాక్సినేషన్ అధికారులు ఉంటారు. వేచిఉండు గది,రిజిస్ట్రేషన్ గది,టీకా వేయు గది,పరిశీలన గది ఉంటాయని తెలిపారు.16వ తేదీ టీకా తీసుకున్న వారు రెండవ మోతాదు 28 రోజుల తర్వాత తీసుకోవాలని సూచించారు. ఈ విధంగా సమాచారం లబ్ధిదారులకు ఫోన్ లో పంపడం జరుగుతుంది అన్నారు. సోమలలో మొదటి టీకాను నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఉప్పరపల్లె స్టాఫ్ నర్స్ లతాకు మొదటి వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో సోమల వైద్యాధికారి డాక్టర్ మానస, తహసిల్ధార్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఎంపీడీఒరామచంద్ర , సి.హెచ్.ఓ.రవిచంద్రన్ , చిన్నప్ప సిబ్బంది పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: The Kovid vaccine is in its infancy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *