లవ్ లైన్ ప్రారంభించిన భూమి పెడ్నేకర్

The land line that started the Love Line is Pednecker

The land line that started the Love Line is Pednecker

Date:28/11/2019

ముంబై ముచ్చట్లు:

మీ భార్య మీ మాట వినడంలేదా? మీ భర్తతో వేగలేకపోతున్నారా? అయితే వెంటనే చేయాల్సిందల్లా ‘వేదికా లవ్‌లైన్’ను సంప్రదించడమే. ఈ లవ్‌లైన్ ద్వారా మీ దాంపత్య సమస్యలన్నీ తీరిపోతాయని గ్యారెంటీ ఇస్తున్నారు బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్. ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘పతి పత్ని ఔర్ వో’. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించారు. ఇందులో భూమి కార్తిక్ భార్య వేదిక పాత్రలో నటించారు. మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కార్తిక్ ప్రియురాలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భూమి ‘వేదికా లవ్‌లైన్’ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా భార్యాభర్తలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను తీర్చగలుగుతానని అంటున్నారు. ‘ఇది ఫన్ సోషల్ మీడియా క్యాంపెయిన్. భార్య, భర్తలతో నేను మాట్లాడి వారి చిన్న చిన్న దాంపత్య సమస్యలను తీరుస్తాను. ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాలో నేను భార్య పాత్రను పోషించాను. కాబట్టి భార్యభర్తలకు నాకు తెలిసిన టిప్స్ చెప్పగలను. ఈ క్యాంపెయిన్ ద్వారా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవుతందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.

 

ఏర్పేడులో నూతన “పొట్టేళ్ళ వారపు సంత” ప్రారంభించిన ఎమ్మెల్యే

 

Tags:The land line that started the Love Line is Pednecker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *