దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక సిద్దం
రంగారెడ్డి ముచ్చట్లు:
దేశం లోనే అతి పెద్ద స్మశాన వాటిక ను హైద్రాబాద్ లో నాగోల్ ఫతుల్లగూడ లో హెచ్ఎండీయే ఏర్పాటు చేసింది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో మూడు మతాల స్మశాన వాటిక నిర్మించింది. # అత్యాధునిక హంగులతో పర్యావరణానికి అనుగుణంగా అతి పెద్ద స్మశానవాటిక ఏర్పాటు అయింది. # సర్వమతాలకు చెందిన అతి పెద్ద స్మశాన వాటిక ను ఒకే దగ్గర ఏర్పాటు చేస్తు ….సరి కొత్త ఓర్వడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. # 25 కోట్ల రూపాయల తో అల్ రిలీజియన్ గ్రేవీయార్డ్ ను నిర్మిస్తుంది. హిందువులకు 2 ఎకరాలు, ముస్లీం లకు 2 ఎకరాలు , క్రిస్టియన్ లకు 2 ఎకరాలు కేటాయించారు. బ్రాహ్మణుల కోసం అపర కర్మల భవనం ఏర్పాటు అయింది. దాదాపు 50 వేల మొక్కల తో ఆహ్లదకరం గా ఉండే విధంగా గ్రినరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మశాన వాటిక లో కట్టే కాల్చడం నిషేధం. సోలార్ పవర్ తో నడిచే విద్యుత్ దహన వాటిక, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో ఉండే వారు, వాళ్ళ బంధువుల దహన సంస్కారాలు చూసేందుకు ప్రత్యేక ప్రసారాలు ఏర్పాటు, పచ్చని పూదోటలులతో ఈ స్మశాన వాటిక నెలలోనే అందుబాటు లోకి రానుంది.
Tags: The largest cemetery in the country is ready

