లారీ ఓనర్ల అందోళన

Date:29/06/2020

ఏలూరు  ముచ్చట్లు:

కరోనా కట్టడిలో భాగంగా నిర్వహించిన లాక్‌డౌన్‌తో ఇసుక లారీలు ఇంటికే పరిమితం కావడంతో .. లారీల యజమానులు, వాటిపైన ఆధారపడిన కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్‌ పోర్టుపైన ఆదారపడిన వారందరికి.. నెల రోజులుగా పనులు లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరి స్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అంతే కాకుండా నెల రోజు లుగా ఉపాది లేకపోవడంతో ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.ఇక ఇసుక లారీలు నింపే కూలీలు ఒక వ్యక్తి రోజుకు రూ. 500 నుంచి రూ. 1000 వరకు సంపాదించుకునే వారని, గత నెల రోజు లుగా పనులు లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతు న్నారు.

 

 

 

 

ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు కూ డ పనులు బంద్‌ చేసిన విషయం తెలిసిందే.ఇక లారీల యజమానులు లారీలకు సంబంధించి ఫైనా న్స్‌, బ్యాంకులకు చెల్లించే వాయిదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి క్లిష్ట సమయంలో ఇసుక లారీల యజమనుల ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని లారీ ఓనర్స్‌ అసో సియేషన్‌ రాష్ట్ర నాయకులు సుర్వీ యాదయ్యగౌడ్‌ విజ్ఞప్తి చేశారు. వాహనాల పన్నుకు మినహాయింపు ఇవ్వడంతో పా టు వాహనాల రుణాలకు సంబంధించి వడ్డీని కూడ మాఫీ చేయాలని, లేదంటే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందుబాటులో పోలీసులు

Tags:The Larry Owners Alliance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *